Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood vs Kollywood: సినిమాకు భాషా సరిహద్దులు ఉండవని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కథ బాగుంటే, నటన సహజంగా ఉంటే, మేకింగ్ ఆకట్టుకుంటే ఏ భాష ప్రేక్షకులైనా సినిమాను ఆదరిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తమిళ స్టార్ హీరోలకు లభిస్తున్న ఆదరణ చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. తెలుగులో అజిత్, విజయ్, సూర్య, కార్తీ వంటి హీరోలకు ప్రత్యేక మార్కెట్ ఉంది. తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి థియేటర్లు దక్కడంతో పాటు.. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఇప్పుడు సాధారణంగా మారింది.
తెలుగులో తమిళ హీరోల జోరు..
తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పాటు వసూళ్ల పరంగానూ సత్తా చాటినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ మరోసారి స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా తర్వాత సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలోనూ తెలుగు మార్కెట్‌పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. తమిళనాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయనే ప్రచారం సినీ వర్గాల్లో సాగింది. దీంతో కోలీవుడ్ హీరోలకు టాలీవుడ్ మార్కెట్ ఎంత కీలకంగా మారిందో మరోసారి చర్చకు వచ్చింది. సూర్య తర్వాత ఆయన తమ్ముడు కార్తీ కూడా ‘సర్దార్ 2’తో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ‘సర్దార్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి తెలుగులో మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌పైనా అంచనాలు నెలకొన్నాయి.
Also Read
మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. తమిళ హీరోలు తెలుగు రాష్ట్రాల్లో తమ సినిమాలను చాలా సింపుల్‌గా మార్కెట్ చేసుకుంటున్నప్పుడు.. టాలీవుడ్ హీరోలకు కోలీవుడ్‌లో అదే రేంజ్లో మార్కెట్ ఉందా? అనే చర్చ స్టార్ట్ అయ్యింది. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నప్పటికీ.. తమిళ మార్కెట్లో మాత్రం ప్రతిసారీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ రావడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా చిత్రాల పరిస్థితితో పాటు.. గతంలో విడుదలైన కొన్ని పలు భారీ చిత్రాలను పరిశీలిస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యత్యాసంపై టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇతర భాషల సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ప్రోత్సాహంతో పోలిస్తే.. తమిళనాడులో తెలుగు చిత్రాలకు అదే స్థాయిలో ఆదరణ, అవకాశాలు లభించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తన ‘క’ సినిమా విడుదల సమయంలో, అలాగే ‘చెన్నై లవ్ స్టోరీ’ సమయంలో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు కిరణ్ అబ్బవరం చెప్పారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో తెలుగు సినిమాలకు థియేటర్లు కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన కామెంట్స్ చేశారు. దీంతో తెలుగు – తమిళ సినీ మార్కెట్ల మధ్య ఉన్న వ్యత్యాసంపై మరోసారి చర్చ మొదలైంది. మొత్తంగా చూస్తే.. తెలుగు ప్రేక్షకులు సూర్య, కార్తీ, అజిత్, విజయ్ వంటి తమిళ హీరోలను తమ హీరోల్లాగే ఆదరిస్తున్నారు. మరి తమిళ ప్రేక్షకులు తెలుగు హీరోలకు అదే స్థాయిలో అవకాశాలు, ఆదరణ ఎప్పుడు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రెండు పరిశ్రమల మధ్య పోటీతో పాటు పరస్పర ఆదరణ కూడా పెరిగితే.. చివరికి దాని ప్రయోజనం దక్షిణాది సినీ ప్రేక్షకులకే దక్కుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
-
Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
-
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!