Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
- డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఫైర్
- ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయంటూ ప్రశ్న
- రైతులు, నిరుద్యోగుల సమస్యలపై విమర్శలు
- మహిళా ఎమ్మెల్యేలపై దాడి అంటూ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు దాటినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు అన్నారు. కరెంటు కొరత, సాగునీరు అందక పంటలు ఎండిపోవడం వంటి సమస్యలతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించి, వారికి అవసరమైన సాయం అందించాలని డిమాండ్ చేశారు.
Also Read
విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన
ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు అన్నారు. మరోవైపు హామీ ఇచ్చిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొందని పేర్కొన్నారు. యువత సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కారని ఆరోపిస్తూ.. బాధితులపైనే కేసులు పెట్టడం అప్రజాస్వామికమని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల ఇలాంటి వ్యవహారశైలి సరికాదని అన్నారు.
ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. అసెంబ్లీని రాజకీయ విమర్శలకు వేదికగా కాకుండా ప్రజా సమస్యలపై చర్చించే వేదికగా ఉపయోగించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?