అల్లు అర్జున్ : సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’’
వేంకటేశ్ దగ్గుబాటి : బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఇతరుల వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా వాడుకోవడం దురదృష్టకరం. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవడం పై నైతిక బాధ్యత ఉండాలి. వ్యక్తిగత జీవితాలను రాజకీయలోకి లాగడం ఎవరికీ ఉపయోగపడదు. ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు గౌరవంగా ప్రవర్తించాలని నేను కోరుతున్నాను.
తమ్మరెడ్డి భరద్వాజ్ : కొండా సురేఖ వాఖ్యలను నేను వ్యక్తిగతంగా కూడా ఖండిస్తున్నాను.బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి..మంత్రిగా కొండా సురేఖకు ఏం తెలుసో తెలీదో గానీ.. ముందు గైడ్ లైన్స్ ఫాలో కావాలి..సినిమా వారిని టార్గెట్ చేయటం తమాషా అయిపోయింది..ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.
మంచు మనోజ్ : మంత్రి కొండా సురేఖ గారి నుండి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం. అధికారంలో ఉన్న మహిళగా, మహిళలు విజయం సాధించడం ఎంత సవాలుతో కూడుకున్నదో మీకు తెలుసు. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై , తప్పుడు ఆరోపణలు ఆమోదయోగ్యం కాదు. కొండ సురేఖ, మీ మాటలను ఉపసంహరించుకోని క్షమాపణ చెప్పాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
రవితేజ : రాజకీయ స్వార్థం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఓ మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలను అవలంబించడం నన్ను భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానానికి మించినది. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సామాజిక విలువలను పెంచాలి కాని వాటిని తగ్గించకూడదు.