Site icon NTV Telugu

Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..

Jr Ntr

Jr Ntr

Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లిపోయాడు. అదే లిస్ట్ లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురూ.. అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్‌ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్‌ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేసింది ఈ సినిమా. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Read Also : Kishkindhapuri : కిష్కిందపురి టీజర్ రిలీజ్.. భయపెట్టేస్తున్న బెల్లంకొండ..

పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న టైమ్ లో ఓం రౌత్ తో ఆదిపురుష్ మూవీ చేశాడు. ప్రభాస్ కెరీర్ లోనే చెత్త సినిమాగా మిగిలిపోయింది. ఎంతగా అంటే.. ప్రభాస్ కటౌట్ కే ఫ్యాన్స్ ఉంటే.. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ చూసి దారుణంగా ట్రోల్స్ చేశారు. ప్రభాస్ కెరీర్ కు భారీ డ్యామేజ్ అయింది. ఆ దెబ్బతో జీవితంలో బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్నాడు రెబల్ స్టార్. ఇప్పుడు ఎన్టీఆర్ వద్దు అనుకుంటూనే అయాన్ ముఖర్జీ మాయలో పడ్డాడు. యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్యచోప్రా పట్టుబట్టి ఎన్టీఆర్ ను వార్-2 సినిమాలోకి తీసుకున్నాడు. కానీ వార్-2తో ఎన్టీఆర్ కు డ్యామేజ్ తప్పలేదు. ఇందులో హృతిక్ రోషన్ లుక్స్ తో ఎన్టీఆర్ ను పోలుస్తూ దారుణంగా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో జూనియర్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయిపోయారు. కూలీ సినిమాకు తెలుగులో వచ్చిన కలెక్షన్ల కంటే ఎన్టీఆర్ సినిమాకు తక్కువ రావడం అంటే మాటలు కాదు. ఇది ఎన్టీఆర్ కు జరిగిన భారీ డ్యామేజ్. కాబట్టి వీరు భవిష్యత్ లో బాలీవుడ్ మాయలో పడొద్దని అంటున్నారు వారి ఫ్యాన్స్.

Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?

Exit mobile version