Tollywood Producer Sushanth Reddy arrested in drugs case: 2017లో టాలీవుడ్ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసిన డ్రగ్స్ కేసు వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా టాలీవుడ్ కి డ్రగ్స్ దందాతో ఉన్న లింకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక ఈమధ్యనే కేపీ చౌదరి అనే నిర్మాత డ్రగ్స్ దందాలో ఉన్నాడని తెలిసి అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు డ్రగ్స్ దందాలో మరో సినీ నిర్మాత ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తెలుగు సినీ నిర్మాత , మాజీ ప్రజా ప్రతినిది కుమారుడు సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో నైజీరియన్లతో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. టాలీవుడ్ లో సినీ నిర్మాతగా ఉన్న సుశాంత్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులకు పక్కాగా సమాచారం అందడంతో గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు సుశాంత్ రెడ్డితోపాటు ముగ్గురు నైజీరియన్లను గుడిమల్కాపూర్ ప్రాంతంలో వలపన్ని అరెస్ట్ చేశారు.
Allu Arjun: వీరాభిమాని ఆఖరి కోరిక తీర్చలేకపోయిన అల్లు అర్జున్
వీరి నుంచి డ్రగ్స్ కొంటున్న మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసున్నారని తెలుస్తోంది. వీరిలో ఓ మాజీ ఎంపీ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది, ఆ మాజీ ఎంపీ ఎవరు అనే వివరాలు బయటకు రాలేదు కానీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. నిజానికి కొద్దిరోజుల క్రితమే కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సుశాంత్ రెడ్డి పేరు కూడా వినిపించింది. అయితే ఆ సుశాంత్ రెడ్డి, ఈ సుశాంత్ రెడ్డి ఒక్కరేనా? లేక వేరు వేరు వ్యక్తులా అనే విషయం పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.