Allu Arjun: వీరాభిమాని ఆఖరి కోరిక తీర్చలేకపోయిన అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun 12 Years Cancer fighting fan Srivasudeva died: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీముఖ్యంగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా తరువాత గాప్ తీసుకుని చేసిన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన అభిమానులు కూడా వయసుతో సంబంధం లేకుండా ఆయనని అభిమానిస్తూ ఉంటారు. ఇక అలా అల్లు అర్జున్ ను పిచ్చిగా అభిమానించిన ఓ చిన్నారి అభిమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కృష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన 12 ఏళ్ల శ్రీ వాసుదేవ అల్లు అర్జున్ కు వీరాభిమాని, అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్ అంటే ఆ బుడతడికి చాలా ఇష్టం.
Naga Chaitanya: కొత్త బిజినెస్ మొదలెట్టిన నాగచైతన్య.. ఇండియన్ రేసింగ్ లీగ్ టీం కొనేశాడు!
Also Read
అయితే ఎక్కువ రోజులు ఆ బాబు బ్రతకడు అని తెలుసుకున్న అల్లు అర్జున ఆ బాబును కలిసి చివరి కోరిక తీర్చాలని అనుకున్నాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్న సమయంలో ఆసుపత్రిలో శ్రీవాసుదేవ చివరి కోరిక తీరకుండానే మృతి చెందాడు. ఇక అతన్ని చూసేందుకు వెళ్ళడానికి సిద్దమైన అల్లు అర్జున్ ఈ విషయం తెలిసి తల్లడిల్లిపోయాడు, ఆ బాలుడి చివరి కోరిక తీర్చలేక పోయానని బాధ పడినట్లు తెలుస్తోంది. ఇక మరోపక్క జవాన్ సినిమాను తాజాగా వీక్షించిన అల్లు అర్జున్ ఆ సినిమాలో నటించిన వారికి, సినిమా యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?