టాలీవుడ్ ని మరోసారి డ్రగ్స్ స్కాండల్ కమ్మేసింది. గతంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ స్కాండల్ ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. నటుడు నవదీప్ ఇన్వాల్వ్ అయ్యాడు అనేసరికి ఒక్కసారిగా డ్రగ్స్ మ్యాటర్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఈ డ్రగ్స్ స్కాండల్ కి సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనుంది. నైజీరియన్లు ఆమోబీ, మైఖేల్, థామస్ లు, సినిమా దర్శకుడు సుశాంత్ రెడ్డి, ఇండస్ట్రీతో సంబంధం ఉన్న రాంచంద్, దేవరకొండ సురేశ్‌రావు, ఖమ్మం సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ లతో పాటు శ్రీకర్ కృష్ణప్రణీత్ లో అరెస్టు చేసారు. మరికొద్దిసేపట్లో వీరిని నాంపల్లి కోర్టులో హాజరు పరుచనున్న పోలీసులు, పరారీలో మరో ఎనిమిది మంది ఉన్నారని సమాచారం. ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య, బిస్త్రా, టెర్రా కేఫ్ ఓనర్ అర్జున్, విశాఖపట్నం వాసి కలహర్ రెడ్డి లతో పాటు మరో ఐదుగురు, డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న మరో ముగ్గురు నైజీరియన్లు పరారిలో ఉన్నారు. నటుడు నవదీప్ అందుబాటులో లేడని పోలీసులు చెబుతుంటే, తాను ఎక్కడికి వెళ్ళలేదని, తనను పోలీసులు అప్రోచ్ కూడా కాలేదని చెబుతున్నాడు.
Read Also: Navadeep: నేనెక్కడికి పారిపోలేదు.. నాకు డ్రగ్స్ కేసుతో సంబంధమే లేదు!