టాలీవుడ్ ని మరోసారి డ్రగ్స్ స్కాండల్ కమ్మేసింది. గతంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ స్కాండల్ ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. నటుడు నవదీప్ ఇన్వాల్వ్ అయ్యాడు అనేసరికి ఒక్కసారిగా డ్రగ్స్ మ్యాటర్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఈ డ్రగ్స్ స్కాండల్ కి సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనుంది. నైజీరియన్లు ఆమోబీ, మైఖేల్, థామస్ లు, సినిమా దర్శకుడు సుశాంత్ రెడ్డి, ఇండస్ట్రీతో…