కోలీవుడ్ నల్ల పొన్ను ఐశ్వర్య రాజేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడి తొమ్మిది నెలలు దాటిపోయింది. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఓ వైపు గడుసు భార్యగా, మరో వైపు అమాయకత్వమైన ఇల్లాలిగా మంచి ఫెర్మామెన్స్ కనిపించింది. భార్య క్యారెక్టర్స్ చేయడానికి హీరోయిన్స్ నో చెప్పే ఇండస్ట్రీలో నలుగురు పిల్లల తల్లిగా నటించి రిస్క్ చేసింది. ఇంత కష్టపడినా తెలుగులో ఆఫర్లు నిల్. ఛాన్సులివ్వండని ఓపెన్ అవుతున్నా కూడా ఈ తెలుగమ్మాయిని పట్టించుకోవడం లేదు లోకల్ మేకర్స్.
Also Read : Maa Vande : నరేంద్రమోడీ బయోపిక్ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్న వీర్ రెడ్డి
టాలీవుడ్ పట్టించుకోకపోతే ఏం కోలీవుడ్ భాగ్యాన్ని వదిలిపెట్టడం లేదు. వరుస ఛాన్సులిచ్చి ఎంకరేజ్ చేస్తోంది. కానీ ఎంతైనా తెలుగుమ్మాయి కదా ఇక్కడ ఇండస్ట్రీపై మనసు చంపుకోలేక డబ్బింగ్ సినిమాలు, సిరీస్‌ల రూపంలో టీటౌన్ ప్రేక్షకులను పలకరించబోతుంది. తమిళ్ వెబ్ సిరీస్ సుజల్2 డబ్బింగ్ వర్షన్ తో ఓటీటీలో పలకరించిన ఐషూ ఇప్పుడు డబ్బింగ్ మూవీతో రాబోతుంది. అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్ కీ రోల్స్ చేస్తున్న తమిళ్ ఫిల్మ్ తీయవర్ కులైగల్ నడుంగ తెలుగులో మప్తీ పోలీసుగా రాబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ ఇంట్రస్టింగ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో కరుప్పర్ నగరం, మోహన్ దాస్ చేస్తోంది. ఇవి షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్నాయి. అలాగే కన్నడలోకి ఎంట్రీ ఇస్తోంది ఈ షైనింగ్ బ్యూటీ. శివరాజ్ కుమార్, పుష్ప ఫేం జాలిరెడ్డి అలియాస్ ధనుంజయ్ కీ రోల్ చేస్తున్న ఉత్తరాఖండలో నటిస్తోంది. షూటింగ్ ఎప్పుడో స్టార్టైనా ఇంకా కంప్లీట్ కాలేదు. టాలెంట్ ఉన్నా భారీ హిట్స్ ఇస్తున్నా డైరీ ఖాళీగానే ఉన్నా మరీ ఈ తెలుగమ్మాయిపై ఇక్కడి మేకర్స్ ఎందుకు కాన్సట్రేషన్ చేయడం లేదు.