Comedians: టాలీవుడ్ కమెడియన్స్ అని అనగానే.. ఒకప్పుడు పది పేర్లు దాదాపు అలవోకగా చెప్పేసేవాళ్ళం.. కానీ, ఇప్పుడు అలా లేదు. ఎవరు కమెడియన్.. ఎవరు నటుడు .. ఎవరు హీరో అనేది పోల్చుకోలేకపోతున్నాం. అదే ఒకప్పుడు కామెడీ కుటుంబం అనగానే బ్రహ్మానందం, బాబు మోహన్, కొత్త శ్రీనివాస్ రావు, చలపతి రావు, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది పేర్లు వస్తాయో లెక్కే లేదు. ఇప్పుడు ఆ కమెడియన్స్ లో చాలామంది కాలం చేశారు. ఉన్నవారు అడపాదడపా కనిపించడమే కానీ, రెగ్యులర్ గా కనిపించేది చాలా తక్కువ. ఇక సోషల్ మీడియా వలన ఎంత నష్టం ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, కొన్నిసార్లు ఇలాంటి రేర్ ఫొటోస్ ను చూసే అవకాశం వచ్చినప్పుడే దాని విలువ కూడా తెలుస్తూ ఉంటుంది.
Pawan Kalyan: గుండెకు గొంతు వస్తే.. బాధకు భాష వస్తే.. అది గద్దర్.. గుండెలను పిండేస్తున్న పవన్ కవిత
అవును.. ఇదుగో ఈ పై ఫొటోలో ఉన్న స్టార్ కమెడియన్స్ ను గుర్తుపట్టండి చూద్దాం. ఇప్పుడున్న పిల్లలకు తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో వీరు లేని సినిమా ఊహించుకోవడం కష్టం అని చెప్పాలి. అందులో ఉన్నది కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం, బాబు మోహన్, తనికెళ్ళ భరణి, చలపతి రావు, కోటా శ్రీనివాసరావు. దాదాపు పాతికేళ్ల క్రితం ఈ ఫోటో దిగినట్లు తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చారు. ఈ ఫోటోలో చలపతి రావు గతేడాది కన్నుమూశారు. ఇప్పటిలా క్యార్ వ్యాన్ లు అప్పుడు ఉండేవి కాదు. షూటింగ్ మొదలు నుంచి అయ్యేవరకు అందరు కలిసే ఉండేవారు. ఇక బ్రహ్మి ఉన్నచోట కామెడీకి కొదువేముంది. ఆయన వేసిన పంచ్ కు మిగతావారందరు నవ్వుతున్నట్లు ఈ ఫోటో చూస్తుంటే తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ ఇది కదా మిలియన్ డాలర్ పిక్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా మరోసారి వీరందరూ కలిస్తే ఎంత బావుంటుందో అని చెప్పుకొస్తున్నారు.