టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణ ముగిసింది. ఉదయం 10.30 నుండి సాయంత్రం 6.30 వరకు ఛార్మి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈడీ అధికారులు కోరిన బ్యాంక్ డ్యాక్యుమెంట్స్ సమర్పించాను.. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాను. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తిరిగి ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు సహకరిస్తాను’ అంటూ ఛార్మి తెలిపింది.
కాగా విచారణ సందర్భంగా ఆమెకు సంబంధించిన రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. 2016లో కెల్విన్‌తో మాట్లాడిన కాల్ డేటా.. వాట్సాప్ ఛాట్‌ను ఛార్మీకి చూపిన అధికారులు దాదా పేరుతో ట్రాన్స్‌ఫర్ అయిన లక్షల రూపాయల లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఛార్మీ ఈడీ అధికారులకు తెలిపింది. కాగా, తదుపరి విచారణలో సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్ హాజరుకావాల్సి వుంది.