మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు ఒకరితో ఒకరు ఎంతో స్నేహంగా ఉంటుంటారు. స్టార్ డైరెక్టర్స్ నుంచి కొత్త దర్శకుల వరకూ ఎలాంటి అమరికలు లేకుండా కలసి మెలసి ముందుకు పోతుంటారు. ఇక వీరి మధ్య ఎలాంటి ఈగో లేకుండా సమకాలీనుల చిత్రాలను ప్రచారం చేసుకుంటుంటారు. పెద్ద దర్శకులు చిన్న దర్శకుల సినిమాల ప్రమోషన్ లో పాల్గొంటూ వాటి సక్సెస్ కోసం కృషి చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల టాలీవుడ్ పలు సమస్యలలో కొట్టుమిట్టాడుతూ వాటి పరిష్కారం కోసం షూటింగ్ లను కూడా నిలిపి వేసి చర్చలు జరుపుతూ వస్తోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న ఈ సమస్యలపై చర్చించేందుకు ఇటీవల నిర్మాతలతో పాటు దర్శకులు కూడా సమావేశం అయ్యారు.
ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శకులు పాల్గొన్నారు. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, సుకుమార్, కొరటాల శివ, బాబీ, వేణు శ్రీరామ్, మెహర్ రమేష్, సుధీర్ వర్మ, పరశురామ్, కృష్ణ చైతన్య, బుచ్చిబాబు సన వంటి దర్శకులు పాల్గొన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సమస్యల పరిష్కారం పక్కన పెడితే ఈ దర్శకుల స్నేహం ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.