Tollywood Director: ఒకప్పుడు అతనో స్టార్ డైరెక్టర్.. అతనితో సినిమా కోసం స్టార్ హీరోలు ఎగబడేవారు. అతను సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని నిర్మాతలు నమ్మేవారు. ఇప్పటికి ఆయన సినిమాలు కామెడీ కి కేరాఫ్ అడ్రెస్స్. అయితే అనుకోకుండా స్టార్ డైరెక్టర్ కెరీర్ అస్తవ్యస్తంగా మారిపోయింది. వరుస ప్లాపులతో డైరెక్టర్ కు ఛాన్స్ లు లేకుండా పోయాయి. దీంతో కొన్నేళ్లు అతను గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ రీ ఎంట్రీగా ఒక హీరోతో సినిమా మొదలుపెట్టినా అది ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళింది లేదు. కాగా, ప్రస్తుతం కెరీర్ కోసం కష్టపడుతున్న ఈ డైరెక్టర్ మరోపక్క వ్యక్తిగతంగాను ఇబ్బంది పడుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు శ్రీను వైట్ల. నీకోసం సినిమాతో కెరీర్ ఆరంభించిన శ్రీను.. ఆనందం, వెంకీ, దుబాయ్ శ్రీను,దూకుడు, ఢీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా శ్రీను వైట్ల భార్య రూప తనకు విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కడం సంచలనం సృష్టిస్తోంది.
శ్రీను వైట్ల, రూప ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ శ్రీను డైరెక్ట్ చేసిన చాలా సినిమాలకు రూప కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేయడమే కాకుండా చాలామంది సెలబ్రిటీలకు పర్సనల్ డిజైనర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఈ జంటకు ముగ్గురు ఆడపిల్లలు. అయితే ఈ జంట మధ్య గత కొన్నేళ్లుగా విబేధాలు నడుస్తున్నాయి. దీంతో రూప పిల్లలను తీసుకొని మూడేళ్ళుగా ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కింది. అయితే అందుకు శ్రీను వైట్ల ఒప్పుకోవడం లేదని సమాచారం. ఇక మ్యూచువల్ డివోర్స్ కాకపోవడంతో ఆమె లీగల్ గా ప్రొసీడ్ కావాలని అనుకోని కోర్టుకు తన బాధను తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంలో శ్రీను వైట్ల స్పందించకపోవడం విశేషం. ఇక వ్యక్తిగత విషయాల వలనే శ్రీను కెరీర్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీను చేతిలో మంచి విష్ణు నటిస్తున్న ‘ఢీ2’ ఒక్కటే ఉంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనేది ఎవరికి తెలియదు. మరి శ్రీను వీటిని అన్నింటినీ చక్కబెడతాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.