ఫస్ట్ టైం ఎమ్మెల్యే…. రెండు ప్రధాన పార్టీల ముఖ్య నేతల్ని ఓడించిన జైంట్ కిల్లర్ ఇమేజ్… ఆ ఊహల్లో ఉండగానే… ఆయనకు సడన్‌గా పొలిటికల్ వైరాగ్యం పుట్టుకొచ్చిందట. అసలు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవడం అన్నది… రాజకీయ నేతల జీవిత కాలపు లక్ష్యం అయితే… ఆయన మాత్రం ఎందుకు ఎమ్మెల్యేని అయ్యాను దేవుడా… అంటూ తలపట్టుకుంటున్నారట. ఎవరా శాసనసభ్యుడు? ఆయన వైరాగ్యానికి కారణాలేంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు సంచలనం. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ…
తెలుగునాట టాప్ స్టార్స్ లో నటరత్న యన్.టి.రామారావులాగా పలు విలక్షణమైన పాత్రలు పోషించిన వారు కానరారు. రామారావుకు పాత్రలో వైవిధ్యం కనిపిస్తే చాలు, వెంటనే ఒప్పేసుకొనేవారని ప్రతీతి. అలా ఆయన అంగీకరించిన చిత్రాలలో విలక్షణ పాత్రలు బోలెడున్నాయి. ‘సంకల్పం’ చిత్రంలో యన్టీఆర్ పోషించిన రఘు పాత్ర అలాంటిదే! జల్సాల కోసం దొంగతనాలు చేసే రఘు, చివరకు పెళ్ళాం నగలు ఎత్తుకెళ్ళి మనసు పడ్డ దానికి ఇస్తాడు. ఇలాంటి విలక్షణ పాత్రలో నందమూరి నటన విశేషంగా అలరించింది. ‘సంకల్పం’…
(అక్టోబర్ 1న రమణారెడ్డి శతజయంతి) కట్టెపుల్లకు బట్టలు తొడిగినట్టుగా ఉండే రూపంతో చూడగానే ఇట్టే నవ్వులు పూయించేవారు రమణారెడ్డి. క్షణాల్లో ముఖంలో అనేక భావాలు పలికించి రమణారెడ్డి నవ్వించిన తీరును తెలుగువారు మరచిపోలేరు. రమణారెడ్డి నటించిన చిత్రాలు ఇప్పటికీ బుల్లితెరపై దర్శనమిస్తూనే ఉంటాయి. ఆయన నటన చూసి నవతరం ప్రేక్షకులు సైతం పడి పడి నవ్వుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. అదీ రమణారెడ్డి నవ్వుల మహాత్యం అనిపిస్తుంది. రమణారెడ్డి పూర్తి పేరు తిక్కవరపు వెంకటరమణారెడ్డి. 1921 అక్టోబర్…
ప్రముఖ సినీ నటుడు, మెజీషియన్ రమణారెడ్డి అభిమానులకు శుభవార్త. నవ్వుల మాంత్రికుని గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన టి.వి. రమణారెడ్డి శత జయంతి సంవత్సరమిది. ఆణిముత్యం లాంటి అరుదైన నటుని శతజయంతి సందర్భంగా ‘నవ్వుల మాంత్రికుడు’ పేరుతో ఓ పుస్తకం రానుంది. ఆయన సమగ్ర జీవిత విశేషాలతో ఈ పుస్తకం సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. మూవీ వాల్యూమ్ మీడియా హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. సీనియర్ జర్నలిస్టు, రచయిత ఉదయగిరి ఫయాజ్ ఈ పుస్తకాన్ని…