Thug Life: లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత జోరు పెంచిన కమల్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి తగ్ లైఫ్. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో నాయకుడు అనే సినిమా తెరకెక్కింది. 1987లో విడుదలైన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా వారి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. దాదాపు 36 ఏళ్ళ తరువాత ఈ కాంబో ఇప్పుడు సెట్ అయ్యింది.నేడు ఈ సినిమా టైటిల్ టీజర్ ను చేశారు. మణిరత్నం టేకింగ్, కే రేవి చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్, కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజన్స్.. ఓవర్ ఆల్ గా టైటిల్ గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పించింది. ఇక ఈ టీజర్ ను పక్కన పెడితే.. సినిమాపై మరింత ఆసక్తిని తెప్పిస్తుంది క్యాస్టింగ్. సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి నటీనటులకు ఒక డైరెక్టర్ సినిమాలో నటించాలని కోరిక ఉంటుంది. అలాంటి డ్రీమ్ డైరెక్టర్స్ లో మణిరత్నం ఒకడు. ఇప్పటికే మణిరత్నం సినిమాలో నటించాలని చాలామంది స్టార్స్ ఎదురుచూస్తున్నారు.
Salaar: సలార్ మరోసారి వాయిదా.. మాస్ మహారాజాకు కలిసొచ్చేలా ఉందే.. ?
ఇక ఆ అదృష్టం రెండోసారి దక్కించుకున్నారు కమల్, త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్. అవును.. వీరందరూ తగ్ లైఫ్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కమల్ – మణిరత్నం కాంబోలో నాయకుడు వచ్చింది. త్రిష, జయం రవి.. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ లో నటించారు. ఇక దుల్కర్.. ఓకే బంగారం సినిమాలో నటించాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరీ పెరిగిపోయింది. ఇక తమిళ్, మలయాళ నటులను కవర్ చేసిన మణిరత్నం.. తెలుగు, హిందీని మాత్రం వదిలేశాడు. పాన్ ఇండియా కాబట్టి.. ముందు ముందు వారిని కూడా రంగంలోకి దించుతాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆ అదృషటన్ని పొందే టాలీవుడ్ నటీనటులు ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.