Salaar: ఏ ముహూర్తాన సలార్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ, రిలీజ్ డేట్ కానీ పక్కగా వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది. గతేడాది రిలీజ్ అవుతుంది అన్న దగ్గర నుంచి డిసెంబర్ 22 రిలీజ్ అవుతుంది అనే వరకు.. ఎన్నో వాయిదాలు.. మరెన్నో అనుమానాలు ఈ సినిమా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కెజిఎఫ్ కన్నా 100 రెట్లు ఈ సినిమాపై అభిమానులు అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ రికార్డులు సృష్టించాయి. ఇక మొదటి నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సలార్ ఈసారి డిసెంబర్ 22 న వస్తుంది అని మేకర్స్ ప్రకటించగానే.. పర్లేదు లేట్ అయినా వస్తుంది అని అభిమానులు ఆనందపడ్డారు.
Kaleru Venkatesh: కొత్తగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తా..
ఇంకోపక్క డైనోసర్ దిగుతుంది అని తెలియడంతో మిగతా సినిమాలు అన్ని అడ్డు తప్పుకొని.. తమకు అనుకూలంగా ఉన్న డేట్స్ ను వెతుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది.. మోకాలి సర్జరీకి విదేశాలకు వెళ్లిన ప్రభాస్ ఇండియా రావడం ఆలస్యం.. ప్రమోషన్స్ మొదలవుతాయి అని ఫ్యాన్స్ అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో.. సలార్ మరోసారి వాయిదా అంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది. అంతే.. ఇక ఎక్కడలేని అనుమానాలు మొత్తం వచ్చేసాయి. అసలు సలార్ సెట్ లో ఏం జరుగుతోంది. కొంతమంది మళ్లీ రీ షూట్ జరుగుతుంది అందుకే లేట్ అవుతుంది అని.. ఇంకొంతమంది విఎఫ్ ఎక్స్ లేట్ అని.. ఇలా రకరకాలుగా చెప్పుకొస్తున్నారు.
Satyam Rajesh: పొలిమేర ఎఫెక్ట్.. హీరోగా మరో సినిమా ఓకే చేసిన కమెడియన్
అసలు ఇదంతా పుకారు.. సలార్ అనుకున్న టైమ్ కే వస్తుంది అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది తెలియదు. ఇక ఈ సినిమా కనుక వాయిదా పడితే.. మాస్ మహారాజా రవితేజ.. తన సినిమాను ఆ డేట్ కు దింపాలని చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమా సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది. అయితే సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. సరే .. ముందు వద్దామంటే.. డైనోసర్ కాచుకొని కూర్చోంది. అందుకే ఇప్పటివరకు సంక్రాంతికే పోదామని ఫిక్స్ అయ్యారు. కానీ, ఎప్పుడైతే సలార్ వాయిదా అంటున్నారో.. ఆ డేట్ ను ఈగల్ సెట్ చేసుకొనే పనిలో ఉందని చెప్పుకొస్తున్నారు. మరి సలార్ వాయిదా మాస్ మహారాజాకు కలిసి వస్తుందేమో చూడాలి.