మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు, యంగ్ డైరెక్టర్స్‌లలో చాలా మంది మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో సందీప్ రెడ్డి కూడా ఒకరు. అయితే సందీప్‌ను డై హార్డ్ మెగాభిమానిగా మాత్రమే చూడలేం. ఎందుకంటే.. మెగా కల్ట్‌కే కల్ట్ ఫ్యాన్ సందీప్. అందుకు నిదర్శనమే లేటెస్ట్ ఫోటో ఒకటి అని చెప్పాలి. గతంలో సందీప్ పలు సందర్భాల్లో తాను మెగాస్టార్ డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. కానీ తన భద్రకాళి సినిమా ఆఫీస్‌లో మెగాస్టార్ ఫోటో చూస్తే మాత్రం మెగాభిమానుల్లో సందీప్ రూటే సపరేట్ అని చెప్పాలి.
Also Read : Masthan Sai : మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం…
గత రెండు రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. తమ భద్రకాళి సినిమా ఆఫీస్‌కి సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేశాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి తాలూకా మాస్ ఫ్రేమ్ ఒకటి నెక్స్ట్ లెవల్లో ఉంది. చిరు నటించిన ఆరాధన సినిమా నుంచి ఒక సీన్‌లోని ఫ్రేమ్‌ను కట్ చేసి ఫ్రేమ్ చేయించుకోని తన ఆఫీస్‌లో పెట్టుకున్నాడు వంగ. వింటేజ్ ఊర మాస్ మెగాస్టార్ లుక్ పీక్స్‌లో ఉందనే చెప్పాలి. సందీప్‌కు మెగాస్టార్ అంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఒక్క ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరు-సందీప్ కాంబినేషన్ సెట్ అయితే చూడాలని అంటున్నారు మెగాఫ్యాన్స్. ఇప్పటికే పలు సందర్భాల్లో మెగాస్టార్‌తో ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు సందీప్. కాబట్టి.. ఈ పవర్ హౌజ్ లాంటి కాంబినేషన్ ఎప్పుడు సెట్ అయినా సరే, బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధ్వంసం చూస్తామని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.