టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువీర్.‘మసూద’ సినిమాలో అతను చూపించిన ఇంటెన్స్ యాక్టింగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. భయపెట్టే సస్పెన్స్‌తో సాగిన ఆ హారర్ థ్రిల్లర్ అతను హీరోగా చేసిన మొదటి సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఇటీవల తన లేటెస్ట్ మూవీ ‘ప్రీ వెడ్డింగ్ షో’ ప్రమోషన్లలో తిరువీర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజా ఇంటర్వ్యూలో తిరువీర్ మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో కొన్ని పెద్ద అవకాశాలు దక్కి కూడా చేజారిపోయాయి. వాటిలో ఒకటి ‘సలార్’ సినిమా. ఆ సినిమాలో కాటేరమ్మ ఫైట్ సీన్‌లో కనిపించే విష్ణు పాత్ర కోసం నన్ను పరిగణించారు. అలాగే మరో పెద్ద ప్రాజెక్ట్ ‘కింగ్డమ్’లో మెయిన్ విలన్ పాత్ర కూడా నాకు వచ్చినా, కొన్ని కారణాల వల్ల ఆ ఆఫర్లు మిస్ అయ్యాను,” అని చెప్పాడు. అదే సమయంలో ఆ పాత్రలు మిస్ అయినందుకు కొంత ఫీల్ అయినట్టు కూడా తెలిపాడు. “అవి రెండు చాలా బలమైన పాత్రలు. నేను ఆ రోల్స్ చేసినా బాగానే సెట్ అయ్యేవాడిని అనిపిస్తుంది. కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టే జరగదు. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టులు కూడా నాకు కొత్త దారులు చూపిస్తున్నాయి,” అని తిరువీర్ చెప్పాడు. గతంలో ‘టక్ జగదీష్’ సినిమాలో నెగటివ్ రోల్ చేసి తనలోని మరో వైపుని చూపించిన తిరువీర్, ఇప్పుడు మళ్లీ విభిన్న పాత్రల్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ద్వారా తను ప్రేక్షకుల్ని మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.