Thika Maka Thanda Movie : రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న ‘తికమక తాండ’ సినిమాతో ఎన్నో చిత్రాల్లో బాల నటిగా అలరించి రాజన్నలో మంచి క్రేజ్ సంపాదించిన ఆని హీరోయిన్ గా పరిచయమవుతోంది. టిఎస్‌ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు ప్రారంభించిన టిఎస్‌ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి గౌతమ్‌మీనన్, చేరన్, విక్రమ్ కె.కుమార్ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ ర్శకత్వం వహిస్తున్నారు. రామకృష్ణ, హరికృష్ణ ఇద్దరు కవలలు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ‘ అర్ధవంతమైన సినిమాలు చేయాలని సినిమాల్లోకి వచ్చానని మొదటి సినిమాకే మంచి కథ కుదిరిందని అన్నారు.
Tantra : గ్లామర్ వదిలేసి హారర్ పై ఫోకస్ పెట్టిన అనన్య
మాటలు, సన్నివేశాలు ఒక్కటేమిటి ఎక్కాడా అసభ్యత లేని కథ ఇదని పేర్కొన్న ఆయన కుటుంబ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని అన్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని సిద్ శ్రీరామ్ పాడిన పుత్తడి బొమ్మ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 11 లక్షల వ్యూస్ తెచ్చుకుందని అన్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ 90లో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. సమాజంలో ఎప్పటి నుండో ఉన్న సమస్య వల్ల ఒక గ్రామం అంతా మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారని, ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారనే అంశం మీద మా సినిమా తెరకెక్కించామని అన్నారు. శివన్నారాయణ, బుల్లెట్ భాస్కర్, యాదమ్మ రాజు, రాకెట్ రాఘవ, బలగం సుజాత వంటి వారు నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా త్వరలో రిలీజ్ కి కూడా రెడీ అవుతోంది.