Tantra : గ్లామర్ వదిలేసి హారర్ పై ఫోకస్ పెట్టిన అనన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్’ సహా ఇటీవల విడుదలైన మళ్ళీ పెళ్లి సినిమాల్లో నటించి అలరించి తన అందాలతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల ఈ సారి భయపెట్టేందుకు వచ్చేస్తోంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘తంత్ర’ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఆ పోస్టర్ కనుక పరిశీలిస్తే భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మరో ఆస్కాక్తికరమైన విశేషం ఏంటంటే దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక మరో కీలక పాత్రలో నటిస్తూ ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. తంత్ర శాస్త్రానికి చెందిన ఎన్నో విస్తుగొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు సినిమా యూనిట్ చెబుతోంది.
Heart Attack: నితిన్ దర్శకుడికి హార్ట్ ఎటాక్.. తీవ్ర విషమంగా హెల్త్ కండిషన్!
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినీరంతో శ్రీనివాస్ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. “ఫిమేల్ ఓరియెంటెడ్ లైన్‌తో రూపొందుతున్న హారర్ ఎంటర్‌టైనర్ ‘తంత్ర’ , భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని పోస్టర్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ తెలిపారు. సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను నరేష్ బాబు పి, రవి చైతన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల కెమెరామేన్లుగా పనిచేసిన ఈ సినిమాకి ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు.
- Tags
- Ananya Nagalla
- Dhanush
- Tantra
తాజావార్తలు
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?