Chiranjeevi:మెగా ఫ్యామిలీలో నేడు పండుగ రోజు.. పదేళ్ల నుంచి అభిమానులు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తాత కాబోతున్నాడు. కూతుర్ల కూతుర్లు ఉన్నా కొడుకు పిల్లలను చూడాలనే ఆశ ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. ప్రస్తుతం చిరు అదే ఆనందాన్ని అందుకుంటున్నాడు. ఇకపోతే రామ్ చరణ్ పిల్లలతో చిరు వంశం మూడో తరంలోకి అడుగుపెట్టనుంది.
ప్రస్తుతం మెగా అభిమానులందరూ ఒకటే కోరుకుంటున్నారు. తాత వంశాన్ని కొనసాగిస్తూ మెగా వారసుడు కావాలి అని.. ఇప్పటివరకు మెగాస్టార్ ఇంట అమ్మాయిల హవానే.. శ్రీజకు ఇద్దరు అమ్మాయిలు.. సుస్మితకు ఇద్దరు అమ్మాయిలు.. వీరు త్వరలో హీరోయిన్లు అవుతారో లేదో తెలియదు.. కానీ.. చరణ్ కు వారసుడు పుడితే.. అసలు సిసలైన మెగా వారసుడు అవుతాడు అనేది నిజం. అందుకే చరణ్ కు వారసుడు పుట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. చిరు వారసుడిగా చరణ్ అడుగుపెట్టాడు.. చరణ్ వారసుడిగా ఫ్యూచర్ అతని కొడుకు అడుగుపెడితే బావుంటుందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా అమ్మాయా..? అబ్బాయా..? అనేది దేవుడి నిర్ణయం.. అభిమానులు కోరికను మరి దేవుడు మన్నిస్తాడో లేదో చూడాలి.