ఒకప్పటి స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ను వరుస ప్లాపులు పలకరించడంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం యాంటోగనిస్టు పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు. తానాజీతో పాటు ఆదిపురుష్, దేవరలో నెగిటివ్ రోల్స్ పోషించాడు. ఇవే పాత్రలు చేస్తే ఇక పర్మినెంట్‌గా విలన్ రోల్స్‌కే పరిమితం చేస్తారని త్వరగానే గ్రహించిన సైఫ్. మళ్లీ హీరో క్యారెక్టర్లపై ఫోకస్ చేస్తున్నాడు. సైఫ్ నెగిటివ్ రోల్స్ వద్దనుకుంటే ఆయన సన్ ఇబ్రహీం అలీఖాన్ చూజ్ చేసుకుంటున్నాడు.
Also Read : Release postpone : మరోసారి రిలీజ్ వాయిదా పడిన భారీ బడ్జెట్ సినిమా
ఇబ్రహీం, ఖుషీ కపూర్ జంటగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా నాదానియా ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. కానీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఇబ్రహీం నటన కూడా సోసో మార్కులే పడ్డాయి. ఇక తన హోప్స్ అన్నీ ‘సర్‌జమీన్’పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నానని అనుకునే టైంలో సడెన్లీ యూటర్న్ తీసుకుంది ప్రాజెక్ట్. థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి రాబోతుంది. జియో హాట్ స్టార్‌లో జులై 25 నుండి డిజిటల్ స్క్రీనింగ్‌కు రెడీ అవుతోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే హీరోగా కాకుండా విలన్ రోల్‌తో పలకరించబోతున్నాడు ఇబ్రహీం. కాజోల్, పృధ్వీరాజ్ సుకుమారన్ జంటగా నటిస్తోన్న సర్ జమీన్ రీసెంట్లీ టీజర్ రిలీజయ్యింది. బొమన్ ఇరానీ సన్ కయోజ్ ఇరానీ ఈ సినిమాకు దర్శకుడు. ఇబ్రహీం అలీఖాన్ టెర్రరిస్టు పాత్రలో కనిపించి షాక్ ఇచ్చాడు. కెరీర్ స్టార్టింగ్‌లో నెగిటివ్ రోల్స్ తీసుకుని రిస్క్ చేయబోతున్నాడు ఇమ్రాన్. అయితే నాదానియాలో యాక్టింగ్ పరంగా మెప్పించలేకపోయిన సైఫ్ సన్ నటనలో మరిన్ని మెళుకువలు నేర్చుకునేందుకు యాంటోగనిస్టు పాత్ర ఫర్ ఫెక్ట్ అని ఫీలయ్యాడో ఏమో విలన్ పాత్రకు షిఫ్టయ్యాడు. హీరో నుండి విలాన్ గా మారిన స్టార్ కిడ్ కు ఇటుంవటి రిజల్ట్ వస్తుందో చూడాలి.