SKN: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన బేబీ నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SKN: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగిన విషయం తెల్సిందే. గుడుంబా శంకర్ దర్శకులు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్.. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ సాయి రాజేష్ , వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందారు. బేబి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యువ నిర్మాత ఎస్ కేఎన్ ఈ విజయోత్సవ సభలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కోసం తనవంతుగా రూ.10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. తన స్నేహితులైన దర్శకులు సాయి రాజేశ్, వశిష్టకు మద్ధతుగా ఎస్ కేఎన్ ఈ విరాళాన్ని అందించారు. ముఖ్యంగా తన స్నేహితుడు సాయి రాజేశ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ వాగ్ధానానికి మద్ధతుగా రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని ఎస్ కేఎన్ అందించారు.
నిర్మాత ఎస్ కేఎన్ ఇచ్చిన విరాళం పట్ల తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మాత ఎస్ కేఎన్ కు చప్పట్లతో అభినందనలు తెలిపారు. దర్శకుల సంఘానికి ఒక నిర్మాత ఇలా విరాళం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు సాయి రాజేశ్. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడిన సాయి రాజేశ్ కు 576 ఓట్లు వచ్చాయి. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఇన్నేళ్ల చరిత్రలో ఒక పదవికి పోటీ చేసిన వ్యక్తికి ఇంత భారీగా ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఇదొక ఎవర్ గ్రీన్ రికార్డ్ గా నమోదైంది.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!