The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise Censor Cuts: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన పొలిటికల్ దుమారం స్టార్ట్ అయ్యింది. ఈమూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న వేళ వెలుగు చూసిన అంశాలు ఇప్పుడు యావత్ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం రా యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో సమకాలీన రాజకీయాలను టార్గెట్ చేస్తూ అత్యంత వివాదాస్పద డైలాగులు, రాజకీయ నాయకుల ప్రస్తావనలు ఉన్నట్లు తాజాగా బయటపడటంతో ఒక్కసారిగా సినిమాపై హైప్ పతాకస్థాయికి చేరింది. సాధారణంగా సినిమాల్లో హింసపై ఆంక్షలు విధించడం సహజం. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో సెన్సార్ బోర్డు ప్రధానంగా రాజకీయ అంశాలపైనే గట్టిగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.
కథలో నేరుగా కొందరు పొలిటికల్ లీడర్ల పేర్లు వినిపించడం, రాజకీయ వ్యవస్థను ఎండగట్టే తీవ్రమైన సంభాషణలు ఉండటంతో బోర్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ వివాదాస్పద పేర్లతో పాటు కీలక డైలాగులను తక్షణమే తొలగించాలని లేదా మార్పులు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అసలు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కథలో టార్గెట్ చేసిన ఆ అగ్ర రాజకీయ నేతలు ఎవరు? ఎలాంటి రాజకీయ సంచలనాలకు ఈ చిత్రం వేదిక కానుంది? అనే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం చిత్ర యూనిట్ ఏకంగా 21 మార్పులు చేయాల్సి వచ్చింది. సినిమాలో చూపించిన రక్తపాతం, టార్చర్ సన్నివేశాలను చాలా వరకు ట్రిమ్ చేశారు. అభ్యంతరకర పదజాలాన్ని మ్యూట్ చేయగా, పలు చోట్ల స్మోకింగ్, సిగరెట్ బ్రాండ్ల వివరాలను మార్చేశారు. ఈ క్రమంలో దాదాపు 25 సెకన్ల విజువల్స్‌ను శాశ్వతంగా తొలగించగా, వివాదాస్పదంగా ఉన్న మరో నిమిషం 25 సెకన్ల దృశ్యాలను ఇతర సన్నివేశాలతో రీప్లేస్ చేయడం గమనార్హం. అన్ని కట్స్, మార్పులు ముగిసిన తర్వాత సినిమా నిడివి 2 గంటల 54 నిమిషాల 4 సెకన్లుగా ఫిక్స్ అయ్యింది. దాదాపు మూడు గంటల పాటు సాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో డైరెక్టర్ ఎంత బోల్డ్‌గా, సమాజంలోని వాస్తవాలను వెండితెరపై ఆవిష్కరించారో ఈ సెన్సార్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. సెన్సార్ ఆంక్షల నడుమ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
తాజావార్తలు
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!