ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Pay: భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో యాపిల్ పే అందుబాటులోకి వచ్చిన దాదాపు పుష్కర కాలం తర్వాత భారత్‌లో లాంచ్ కానుండటం టెక్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం దేశీయంగా 84 శాతానికి పైగా మార్కెట్‌ను శాసిస్తున్న ఫోన్‌పే, గూగుల్ పే ఆధిపత్యానికి ఇది ఎంతవరకు గండి కొడుతుందనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం భారత్‌లో వీధి వ్యాపారుల నుంచి భారీ షాపింగ్ మాల్స్ వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు పంపే యూపీఐ పద్ధతే అత్యంత ప్రాచుర్యంలో ఉంది.
ఇలాంటి టైంలో ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న యాపిల్ పే ఎలాంటి సేవలతో యూజర్స్‌ను ఆకట్టుకుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం.. భారత్‌లో యాపిల్ పే ప్రారంభ దశలో ప్రధానంగా క్రెడిట్ కార్డుల ఆధారిత ‘ట్యాప్ అండ్ పే’ (POS మెషీన్లపై కార్డుతో పనిలేకుండా స్వైప్ చేసే విధానం) సేవలతోనే రావచ్చని తెలుస్తోంది. ప్రాథమికంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ సేవలు స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మొదటి దశలో క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ సదుపాయం లేకపోతే, నిత్యం చిన్న మొత్తాల లావాదేవీలు జరిపే సాధారణ యూజర్స్‌ను ఇది పెద్దగా ఆకర్షించలేకపోవచ్చనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పైగా ఫోన్‌పే, గూగుల్ పేలు ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ పనిచేస్తుండగా, యాపిల్ పే కేవలం ఐఫోన్, యాపిల్ వాచ్ యూజర్లకు మాత్రమే పరిమితం కానుంది.
Also Read
- Delimitation: లోక్‌సభలో సీట్లు పెరిగితే ఖర్చుల సంగతేంటి? పూర్తి లెక్కలివే!
- Tata Group: టాటా గ్రూప్‌లో కుమ్ములాట.. హైకోర్టు మెట్లు ఎక్కిన ట్రస్టులు!
- TRAI New Rules: జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ షాక్.. ఇక చౌక రీఛార్జ్ ప్లాన్లు మొదట కనిపించాల్సిందేనా..?
- Funeral Pre-Booking: ఇదేం వింత బిజినెస్ భయ్యా.. సొంత అంత్యక్రియలకు ముందే అడ్వాన్స్ బుకింగ్!
అయితే యాపిల్ పే భారత్‌లో యూపీఐ సపోర్ట్‌తో కూడా రావచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకవేళ నేరుగా యూపీఐ నెట్‌వర్క్‌తో యాపిల్ పే మార్కెట్లో దిగితే అప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రత్యేకంగా ఎలాంటి థర్డ్ పార్టీ యాప్‌లు తెరవాల్సిన అవసరం లేకుండా, ఫోన్ లాక్ స్క్రీన్‌లో ఉన్నప్పుడే కేవలం ‘ఫేస్ ఐడీ’ లేదా ‘టచ్ ఐడీ’ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో పేమెంట్ పూర్తయ్యేలా యాపిల్ పే పనిచేస్తుంది. దీంతో ఐఫోన్ వాడుతున్న ప్రీమియం కస్టమర్లు ఫోన్‌పే, గూగుల్ పేలకు బదులుగా ఇన్-బిల్ట్‌గా ఉండే యాపిల్ పే వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి దశలో కేవలం క్రెడిట్ కార్డుల చెల్లింపులకే పరిమితమైతే, దేశీయ పేమెంట్ యాప్‌లకు తక్షణ ముప్పు లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో యాపిల్ పే యూపీఐ సేవలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే మాత్రం భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో తీవ్ర పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్‌కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..!
-
Delimitation: లోక్‌సభలో సీట్లు పెరిగితే ఖర్చుల సంగతేంటి? పూర్తి లెక్కలివే!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!