‘ది కేరళ స్టొరీ’… గత మూడు వారాలుగా ఇండియాని కుదిపేస్తున్న ఒకే ఒక్క సినిమా. అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమాని రాష్ట్రాలకి రాష్ట్రాలే చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలేమో ది కేరళ స్టోరీ సినిమాకి టాక్స్ ని కట్ చేసి మరీ రాయితీలు ఇస్తున్నాయి. ఎంత రచ్చ జరిగినా ది కేరళ స్టోరీ కలెక్షన్స్ మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. మూడో శనివారం కూడా 9 కోట్లకి పైగా రాబట్టింది అంటే కేరళ స్టొరీ ఎలాంటి హోల్డ్ ని మైంటైన్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ది కేరళ స్టొరీ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించలేదు. డే 1 కన్నా డే 14 ఎక్కవ కలెక్షన్స్ ని రాబట్టి ట్రేడ్ వర్గాలు కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది ది కేరళ స్టొరీ సినిమా.
ప్రాపగెండానా లేదా ఇంకోకటా అనేది పక్కన పెడితే ఒక లేడీ ఓరియెంటెడ్ చిన్న సినిమా, కేవలం 15-16 కోట్ల బడ్జట్ తోనే రూపొందిన ఒక సినిమా… ఈరోజు వారం తిరిగే లోపు 82 కోట్లు, రెండో వారం ఎండ్ అయ్యే లోపు 160 కోట్ల బెంచ్ మార్క్ ని రీచ్ అవ్వడం గొప్ప విషయమే. మూడు వారం ఎంటర్ అయ్యే లోపు 180 కోట్లు రాబట్టడం చిన్న విషయం కాదు. ఈరోజు, రేపు ది కేరళ స్టొరీ ఇదే జోష్ ని మైంటైన్ చేస్తే చాలు కలెక్షన్స్ మళ్లీ పుంజుకుంటాయి. మండే ఎండ్ అయ్యే లోపు ది కేరళ స్టొరీ సినిమా 200 కోట్ల మార్క్ ని చేరుకోవడం గ్యారెంటీ. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ ఓవరాల్ థియేట్రికల్ రన్ లో 250 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది.