The India Box Office Report-October: వెండి తెరను మురిపించి.. మెరిపించిన సం‘చలన’ చిత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The India Box Office Report-October: అక్టోబర్‌కు సంబంధించిన ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ నెలలో దేశం మొత్తమ్మీద ఏ భాషలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? వాటికి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? అన్నింటికన్నా ఏ మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది? తదితర విషయాలను ఈ నివేదిక ప్రేక్షక దేవుళ్లకు సమగ్రంగా సమర్పిస్తోంది.
అక్టోబర్‌లో రిలీజైన అన్ని పిక్చర్లకూ కలిపి 772 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇందులో మేజర్ షేర్ మాత్రం కాంతార చిత్రానిదే. ఈ బొమ్మ.. కన్నడ భాషలో సెప్టెంబర్‌లోనే విడుదల కాగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మాత్రం అక్టోబర్‌లో వచ్చింది. అందువల్ల కాంతార కలెక్షన్ల గురించి సెప్టెంబర్ నివేదికతోపాటు అక్టోబర్ రిపోర్ట్‌లోనూ ప్రస్తావించారు.
Also Read
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
- The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
కాంతర ఫిల్మ్.. అక్టోబర్‌లో భారతీయ వెండి తెరను మురిపించి.. మెరిపించి.. మైమరపించింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ మరియు అక్టోబర్‌లో అన్ని భాషల్లో కలిపి 346 కోట్లు సంపాదించింది. అక్టోబర్‌లో టాప్-10లో నిలిచిన చిత్రాల్లో కాంతార తర్వాత గాడ్‌ఫాదర్, రామ్‌సేతు, సర్దార్, బ్లాక్ ఆడమ్, థ్యాంక్‌గాడ్, ప్రిన్స్, డాక్టర్జీ, జయ జయ జయ జయహే, గంధద గుడి ఉన్నాయి.
read more: Digital Payments: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు
కాంతార సినిమా అక్టోబర్‌లో అరుదైన ఘనత సాధించింది. 100 కోట్ల వసూళ్లు దాటిన వన్ అండ్ ఓన్లీ మూవీగా పేరొందింది. గాడ్‌ఫాదర్ 89 కోట్లు, రామ్‌సేతు 88, సర్దార్ 68, బ్లాక్ ఆడమ్ 59, థ్యాంక్ గాడ్ 39, ప్రిన్స్ 35, డాక్టర్జీ 30, జయ జయ జయ జయహే 24, గంధద గుడి 23 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. అక్టోబర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్లు 9 వేల 24 కోట్ల రూపాయలకు చేరాయి.
కాంతార మూవీకి వచ్చిన మొత్తం డబ్బు 346 కోట్లలో దాదాపు 47 శాతం ఒక్క కన్నడ భాషలోనే రావటం విశేషం. మిగిలిన 53 శాతంలో హిందీ వెర్షన్ లీడింగులో నిలవటం చెప్పుకోదగ్గ విషయం. కాంతార చిత్రం.. ఈ ఏడాది మొత్తమ్మీద.. కలెక్షన్ల విషయంలో నంబర్-3 ర్యాంకు పొందింది. మొదటి రెండు స్థానాల్లో కేజీఎఫ్ చాప్టర్-2 మరియు ట్రిపుల్ ఆర్లు ఉన్నాయి.
నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ఆడియెన్స్ ముందుకు వచ్చే మూవీలు కనీసం 19 వందల 24 కోట్ల రూపాయలు రాబట్టాయంటే 2022 సంవత్సరం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘‘ది బెస్ట్’’గా నిలుస్తుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేస్తుంది. 10 వేల 948 కోట్ల రూపాయలతో ఈ రికార్డు ఇప్పటివరకు 2019వ సంవత్సరం పేరిటే ఉండిపోయింది.
సెప్టెంబర్ దాక ఉన్న డేటా మేరకు ఈ ఏడాది టాప్-10 పిక్చర్ల లిస్టులో 3వ స్థానంలో పొన్నియన్ సెల్వన్ ఉండేది. కానీ.. అక్టోబర్‌లో అప్డేట్ చేసిన రిపోర్టులో 3వ స్థానాన్ని కాంతార ఆక్రమించటం గమనించాల్సిన అంశం. దీనివల్ల పొన్నియన్ సెల్వన్ ర్యాంక్ 3 నుంచి 4కి పడిపోయింది. సెప్టెంబర్‌లో టాప్-10 లిస్టులో అట్టడుగున ఉండిపోయిన గంగూబాయి కతియావాడి మూవీ ఈసారి కాంతార ఎంట్రీతో మాయమైంది.
జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్లను భాషల వారీగా పరిశీలిస్తే కన్నడ చిత్రాల వసూళ్ల వాటా గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 9 శాతానికి పెరిగింది. కేజీఎఫ్ చాప్టర్-2 మరియు కాంతార బిగ్ సక్సెస్ అవటంతో కన్నడ మూవీల కలెక్షన్లు ఆల్‌టైం హైలెవల్ను చేరుకున్నాయి. సెప్టెంబర్ నాటికి ఈ షేరు 8 శాతంగా నమోదైంది. 2019తో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు కావటం విశేషం.
ఇక.. ఈ 10 నెలల వసూళ్లలో మెజారిటీ వాటా హిందీ చిత్రాలదే. ఆ తర్వాత.. తెలుగు సినిమాలున్నాయి. హిందీ మూవీల షేరు 33%గా, తెలుగు చిత్రాల వాటా 22%గా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్ వసూళ్లలో 37% తెలుగు, తమిళ, కన్నడ సినిమాలను ఆ భాషలోకి డబ్బింగ్ చేయటం వల్ల వచ్చినవే. ఇదిలాఉండగా తమిళ పిక్చర్ల షేరు సెప్టెంబర్ వరకు 19%గా ఉండగా అక్టోబర్ నాటికి 18%కి పడిపోయింది.
తాజావార్తలు
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!