Nithin Macherla Niyojakavargam నితిన్ కథానాయకుడిగా ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. చివరాఖరి పాటతో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి హీరో నితిన్ డబ్బింగ్ చెప్పడం కూడా స్టార్ట్ చేశాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రాజ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో, సరైన నిర్మాణ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇందులో నితిన్, కృతిశెట్టి జోడి చాలా బ్యూటీఫుల్ అండ్ రెఫ్రెషింగ్ గా వుందని, అంజలిపై చిత్రీకరించిన పాట మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని, కేథరిన్ థ్రెసా పాత్ర ఇందులో కీలకమైనదని దర్శకుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.