Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన బోల్డ్ బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ ఐకానిక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందంటూ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ చేసిన అధికారిక ప్రకటన బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి సీక్వెల్ సిల్క్ స్మిత జీవిత కథ కాదని తేల్చిచెప్పడం, లీడ్ రోల్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరు తెరపైకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. 2011లో విడుదలైన ది డర్టీ పిక్చర్ సిల్క్ స్మిత జీవితాన్ని తెరపై ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. కానీ తాజా సీక్వెల్‌పై ఏక్తా కపూర్ స్పందిస్తూ.. ఇది సిల్క్ స్మిత ప్రయాణం కాదని స్పష్టం చేశారు. సమాజపు కట్టుబాట్లను ఎదురించి నిలిచిన మరో పవర్ఫుల్ లేడీ జీవితం, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ, ఎదుర్కొన్న పోరాటాల చుట్టూనే ఈ రెండో భాగం తిరుగుతుందని వెల్లడించారు. స్టోరీ లైన్‌పై ఇచ్చిన ఈ క్లారిటీతో, ఈసారి ఎవరి జీవితాన్ని, ఎలాంటి బోల్డ్ కాన్సెప్ట్‌ను వెండితెరపై చూపిస్తారనే ఉత్కంఠ మొదలైంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్ర కోసం వినిపిస్తున్న పేర్లలో తమన్నా భాటియా, ‘యానిమల్’ ఫేమ్ తృప్తి దిమ్రి ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా తమన్నా ఈ పాత్ర దక్కించుకుంటే అది ఆమె కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, క్లిష్టమైన సవాలుగా మారడం ఖాయం అనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జైలర్’, ‘స్త్రీ 2’ వంటి ప్రాజెక్ట్‌లతో ఇప్పటికే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సరికొత్త క్రేజ్ సొంతం చేసుకున్న తమన్నా, బోల్డ్ అండ్ ఎమోషనల్ పాత్రలను సమర్థంగా పోషించగలదని నిరూపించుకుంది. అయితే ఫస్ట్ పార్ట్‌లో విద్యాబాలన్ చూపించిన నట విశ్వరూపం, పలికించిన భావోద్వేగాలు భారతీయ సినీ చరిత్రలోనే ఒక బెంచ్‌మార్క్‌గా మిగిలిపోయాయి. ఆ స్థాయి ఇంటెన్సిటీని అందుకోవడం, విద్యాబాలన్ సృష్టించిన ఇంపాక్ట్‌ను అధిగమించడం ఎవరికైనా కత్తిమీద సామే. ఒక వేళ సెకండ్ పార్ట్‌లో తమన్నా లీడ్ రోల్‌కి సెలక్ట్ అయితే ఈ పోలికలను తట్టుకుని నిలబడటం మిల్కీ బ్యూటీకి అసలైన పరీక్షగా మారనుంది. ప్రస్తుతానికి నటీనటులు, దర్శకుడు, విడుదల తేదీలపై చిత్ర బృందం పూర్తి గోప్యత పాటిస్తోంది. కాస్టింగ్‌పై అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో ఎవరు ఫైనల్ అయ్యారో తెలియదు.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!