20 ఏళ్లలో 25 ఫిల్మ్స్ చేసి కెరీర్‌ను ఓ పద్థతిగా ప్లాన్ చేసుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార స్వామి. సూదు కవ్వం, కాదలమ్ కండాదు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తీ 26గా 2023లో ప్రారంభమైన ఈ సినిమాకు వా వాతియార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
Also Read : Tollywood : హిట్ కొడితే హీరో.. ప్లాప్ అయితే డైరెక్టర్.. టాలీవుడ్ తీరే వేరు
కార్తీ పోలీసాఫీసర్‌గా సరికొత్త గెటప్‌లో చూపించబోతున్నాడు దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కన్నా వెనుక స్టార్టైన కార్తీ 27 సత్యం సుందరం ఇప్పటికే రిలీజై క్లాసిక్ హిట్ అందుకుంది. అలాగే సర్దార్ 2 కూడా శరవేగంగా షూటింగ్ చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ వా వాతియార్ మాత్రం కంప్లీట్ కాలేదని టాక్. ఇంకా 20 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందని కోలీవుడ్‌లో గుస గుసలు వినిపిస్తున్నాయి. షూటింగ్ డిలేపై నిర్మాత కూడా నలన్‌పై గుర్రుగా ఉన్నాడన్నది బజ్. ఇప్పటికే అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల కోసం దర్శకులను లైన్లో పెట్టేస్తుంటే వా వాతియార్ కంప్లీట్ కాకపోవడంతో నెక్ట్స్ ప్రాజెక్టులపై కార్తీ ఫోకస్ చేయలేకపోతున్నాడట. డైరెక్టర్ తమిళతో కార్తీ 29 ఎనౌన్స్ చేశాడు. లోకేశ్ కనగరాజ్ ఖైదీ 2 ఉంటుందని వెల్లడించాడు. ఇవే కాకుండా మారి సెల్వరాజ్, హెచ్ వినోద్, వాసు దేవ్ మీనన్‌తో కొలబరేట్ కాబోతున్నాడన్నది బజ్. కానీ వా వాతియార్ సెట్స్ పైనే ఉండటంతో వీటికి షిఫ్ట్ కాలేని పరిస్థితి. ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేద్దామనుకుంటే.. షూటింగ్ కంప్లీట్ కాలేదు.. ఇప్పడు జూన్‌లో అనుకుంటే.. అప్పుడు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదట. ఇప్పుడు సెప్టెంబర్ 5కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అప్పటికైనా వస్తుందో రాదో.