గుంటూరు కారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ ఇది.. మహేష్ సర్కారు వారి పాట సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. కానీ సినిమాను మొదలు పెట్టిన తరువాత వరుసగా మహేష్ కుటుంబం లో జరిగిన విషాదాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.భారీ గ్యాప్ తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు మహేష్. ఆ సినిమాకు గుంటూరు కారం అనే ఊర మాస్ టైటిల్ ను ఫిక్స్ చేసారు.తన తండ్రి కృష్ణ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేసారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు , శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి తర్వాత షూట్ మొదలు పెట్టింది.
అయితే రెండు షెడ్యూల్స్ తర్వాత ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.. ఇప్పటికీ కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ కాలేదు.. మరి ఈ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి మాత్రం ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.. ఇప్పటికే ఈ సినిమా నుండి మాస్ స్ట్రైక్ అంటూ ఒక గ్లింప్స్,టైటిల్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత మహేష్ బాబు పూర్తిగా రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించ బోతున్నాడని అందరికి అర్ధం అయింది… ఇక తాజాగా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా భారీ యాక్షన్ తో నడుస్తాయని సమాచారం… గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ ఫ్లాష్ బ్యాక్ నడుస్తుందని తెలుస్తుంది.అంతేకాదు ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బాగా ఉంటుందని సమాచారం ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని సమాచారం.