రూమర్స్ నమ్మొద్దు… అంటూ నాగఛైతన్య నెక్స్ట్ మూవీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ పుకార్లను కొట్టిపారేశారు. ఈరోజు ఉదయం నుంచి నాగ చైతన్య నెక్స్ట్ మూవీ “థాంక్యూ” మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో నేరుగా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా కథానాయికగా నటించింది. అయితే దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇస్తూ సినిమాని థియేటర్లలో మాత్రమే విడుదల చేయనున్నట్టు ధృవీకరించారు.
Read Also : “పుష్ప”రాజ్ కు హిందీ డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?
కొద్దిసేపటి క్రితం దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రం గురించి ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. “థ్యాంక్యూ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అపారమైన అంకితభావంతో ఈ చిత్రాన్ని నిర్మించాము. ఇది పెద్ద తెరపై మాత్రమే చూడటం ఒక మంచి అనుభవం అని మేము నమ్ముతున్నాము. ‘థ్యాంక్యూ’ మూవీని సరైన సమయం వచ్చినప్పుడు థియేటర్లలో విడుదల చేస్తాం” అని చిత్ర యూనిట్ ప్రకటించింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. “మనం” విజయవంతమైన తర్వాత నాగ చైతన్య విక్రమ్‌తో కలిసి నటిస్తున్న రెండవ చిత్రం ఇది. వీరిద్దరూ ప్రస్తుతం మరో హారర్ వెబ్ సిరీస్ కోసం కూడా కలిసి పని చేస్తున్నారు.
#ThankYouTheMovie will release only in theaters. pic.twitter.com/M3i7N9qw7J
— Sri Venkateswara Creations (@SVC_official) December 8, 2021