SS Thaman: మ్యూజిక్ డైరెక్టర్ థమన్ భార్య ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక మరోపక్క ఇండియన్ ఐడల్ షో కు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బిజీగా మారాడు. అయితే ఇప్పటివరకు థమన్ పడిన స్ట్రగుల్స్ గురించి విన్నామే కానీ థమన్ ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే థమన్ కు పెళ్లి అయ్యిందా..? లేదా ..? అనేది కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే థమన్ చాలా ప్రైవేట్ పర్సన్.. కుటుంబాన్ని ఎప్పుడు సోషల్ మీడియాలో చూపించడు. కనీసం ఏ ఫంక్షన్ కు కుటుంబంతో కలిసి రాలేదు. సోషల్ మీడియాలో ఉన్నా కూడా తన భార్య పిల్లల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇంకా చాలా మంది థమన్ కు పెళ్లి కాలేదనే అభిప్రాయంలో ఉన్నారు. అయితే ఇన్నాళ్లకు ఆయన తన భార్య గురించి బాహాటంగా చెప్పారు.
‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని, ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చాడు. ” నా భార్య వర్ధిని వాయిస్ బాగుంటుంది. ఆమె వాయిస్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలకు నచ్చి.. వర్ధినితో పాడిస్తే బాగుంటుందని భావిస్తే తప్పకుండా ఆమెతో పాడిస్తాను. వర్ధినితో స్టేజ్ షో లు చేయాలి అనేది నా డ్రీమ్.. వర్ధినితో స్టేజ్ షో లు చేయడానికి ముందు ఆమె మూడు నాలుగు పాటలతో హిట్ అవ్వాలి. ఆమె పాడిన పాటలు హిట్ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి స్టేజ్ షో లు చేస్తాం.. ఇక నా కొడుకే నా ట్యూన్స్ ను మొదట వింటాడు. అప్పుడే వాడికి పలు మ్యూజిక్ పరికరాలపై మంచి పట్టు వచ్చింది. ఫ్యూచర్ లో వాడు ఏమి కావాలో వాడే డిసైడ్ అవ్వాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం థమన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!