మహానటి ఫేమ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ వరుస ప్లాప్స్ వెంటాడుతున్న.. అందాల ఆరబోత లేకున్నాను.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కీర్తి నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో పాటుగా ‘మరక్కార్’ అనే మలయాళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’తో పాటు రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలావుంటే, కీర్తి తమిళంలో మరో బిగ్ ఆఫర్ ను పొందింది. విజయ్ హీరోగా నటించే సినిమాలో ఆమె నటిస్తుందని సమాచారం. ఇప్పటికే విజయ్‌తో ఓసారి కీర్తి సురేష్ కలిసి నటించింది. అయితే, కీర్తి ప్రస్తుతం విజయ్ తో నటించే సినిమా దర్శకుడు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. వంశీ పైడిపల్లి, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించనున్న విషయం తెలిసిందే. మరి ఏ సినిమాలో కీర్తి నటిస్తుందనేది ఇంకా వెల్లడి కాలేదు. కాగా, వంశీ పైడిపల్లి-విజయ్ కాంబినేషన్ లోనే కీర్తి నటించనుందనే ప్రచారం మాత్రం ఎక్కువగా జరుగుతోంది.