Thalapathy Vijay: ప్రమోషన్స్ కి రారు కానీ మా పైసల్ కావాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం రాష్ట్రాలు దాటి ఇతర ఇండస్ట్రీలకి వెళ్లి మరీ తమ సినిమాలని ప్రమోట్ చేస్తున్నారు. మా సినిమా బాగుంటుంది, తప్పకుండ చూడండి, ఆదరించండి అంటూ స్పెషల్ మీడియా ఇంటరాక్షన్స్ పెట్టి మరీ అడుగుతున్నారు. ఆ హీరోల కలెక్షన్స్ పెరగడానికి ఈ ప్రమోషన్స్ కూడా ఎంతో హెల్ప్ అవుతున్నాయి. అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు.
తన సినిమాలని డబ్ చేసి తెలుగులో విడుదల చేస్తున్నాడు కానీ ఒక్కరు కూడా విజయ్ ని హైదరాబాద్ తీసుకోని రావడం లేదు. శంకర్ డైరెక్ట్ చేసిన ‘స్నేహితుడు’, మురుగదాస్ డైరెక్ట్ చేసిన ‘తుపాకీ’ సినిమాల కోసం చివరగా విజయ్ హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి కానీ ఒక్కసారి కూడా విజయ్ మన దగ్గర ప్రమోషన్స్ చెయ్యలేదు. చిత్ర యూనిట్ మొత్తం వచ్చినా తను మాత్రం అటెండ్ అవ్వడు. మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అయినా విజయ్ ని హైదరాబాద్ రప్పిస్తాడు అనుకుంటే, రప్పించలేక పోయాడు. విజయ్ వస్తాడు అని దిల్ రాజు చెప్పాడు కానీ మాట వరసకి మాత్రమే, ఎప్పుడు రానీ విజయ్ వారసుడు సినిమా కోసం కూడా రాలేదు. ఇప్పుడు లియో సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉంది. అక్టోబర్ 19న రిలీజ్ అవ్వనున్న ఈ మూవీ ఆడియో లాంచ్ కి తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ప్రమోషన్స్ చేయడు. నాగ వంశీ లాంటి ప్రొడ్యూసర్ ధనుష్ ని హైదరాబాద్ కి రప్పించాడు కానీ అది విజయ్ విషయంలో అయ్యేలా కనిపించట్లేదు. ఈ కారణంగానే లియో సినిమాకి తెలుగులో బజ్ లేదు.
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
తన తమిళ అభిమానుల కోసం భారి ఆడియో లాంచ్ చేసి, “ఎన్ నింజిల్ కుడి ఇరుక్కుం” అంటూ స్పీచ్ ఇచ్చే విజయ్, తన తెలుగు అభిమానులకి కనీసం హాయ్ కూడా చెప్పట్లేదు. ఇక్కడ డబ్బులు కావాలి కానీ ఇక్కడ ప్రమోషన్స్ చెయ్యను అంటే ఫ్యూచర్ లో విజయ్ సినిమాల కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఉండవు. ఈ విషయం విజయ్ వీలైనంత త్వరగా అర్ధం చేసుకోని, మార్కెట్ పెంచుకోవాలి అనుకుంటే తమిళనాడు దాటి బయటకి వచ్చి సినిమాని ప్రమోట్ చెయ్యాల్సిందే అని గుర్తించాలి. విజయ్ అది చెయ్యలేకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా, ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ కొట్టినా విజయ్ ఒక రీజనల్ హీరోగానే మిగిలిపోతాడు.
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!