Vijay: స్టార్లు.. సోషల్ మీడియా.. పర్ఫెక్ట్ కాంబినేషన్. తమ అభిమానులను దగ్గరగా ఉండడానికి స్టార్లు ఎంచుకున్న ఏకైక మార్గం సోషల్ మీడియా. నిత్యం తమ కుటుంబ విషయాలు, సినిమా విషయాలు, అభిమానులకు థాంక్స్ చెప్పాలన్నా.. తమ సినిమా చూడండి అని చెప్పాలన్నా సోషల్ మీడియానే మార్గం. అందుకే స్టార్లు నిత్యం సినిమాలు చేసినా చేయకపోయినా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో మాత్రం యాక్టివ్ గా ఉంటారు.. అభిమానులను పెంచుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ లేని స్టార్ హీరోల్లో విజయ్ ఒకడు. కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నా దళపతికి ఇప్పటివరకు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ లేదు. ఎప్పటి నుంచో అభిమానులు అన్నా.. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చెయ్.. అంటూ మొత్తుకున్నా విజయ్ వినలేదు.
Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ పెళ్లి.. అంత చిన్న అమ్మాయితోనా..?
ఇక తాజాగా ఏమనుకున్నాడో ఏమో మొట్టమొదటిసారి విజయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఓపెన్ చేశాడు. ఇంకా అలా క్రియేట్ చేయడమే ఆలస్యం.. అభిమానులు లైక్లు, కామెంట్స్ తో సునామీ సృష్టించేశారు. అది ఎంతలా అంటే.. 97 నిమిషాల్లోనే 1 మిలియన్ ఫాలోవర్లు.. ఫాలో కొట్టి రికార్డు సృష్టించారు. ఇక తన మొదటి పోస్ట్ గా విజయ్ తన కొత్త లుక్ తో ఫోటోను పోస్ట్ చేశాడు. బ్లాక్ కలర్ కోట్.. రగ్గడ్ లుక్ లో విజయ్ అదిరిపోయాడు.. హాయ్ నంబా అండ్ నంబిస్ అంటూ వెల్కమ్ చెప్పాడు. ఇక విజయ్ ఫ్యాన్స్ ఊరికే ఉంటారా.. వచ్చాడు.. అన్న వచ్చాడు అని కొందరు.. మాస్టర్ వెల్కమ్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ పేజ్ ను విజయ్ ఆఫీస్ వాళ్లు హ్యాండిల్ చేస్తారట. మరి విజయ్ అప్పుడప్పుడు తన గురించి, తన కుటుంబం గురించి ఏమైనా చెప్తాడేమో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమాలో నటిస్తున్నాడు.