Chilkur Balaji Temple Chief Priest Rangarajan Appreciates Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకున్నా వసూళ్లు మాత్రం ఒక రేంజ్ లో వస్తున్నాయి. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటించారు. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ రెట్రో ఫైల్స్ సంస్థతో కలిసి సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక ఈ సినిమా మీద తాజాగా ప్రశంసలు కురిపించారు చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్. రామాయణ ఇతిహాసాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు వారు చేస్తున్న కృషి అమోఘం అని అంటూనే ప్రపంచవ్యాప్తంగా రామాయణ మహాకావ్యం గురించి చాటిచెప్పిందని కొనియాడారు.
Harish Shankar: ఆ ఘటన కలచివేస్తోంది, యాక్షన్ లోకి దిగండి.. ఏపీ పోలీసులకు హరీష్ శంకర్ విజ్ఞప్తి
ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి శ్రీ రాముల వారి గుణాలు గురించి అందరూ వెతుకుతున్నారని.. ఈ సినిమాలో చూపించినట్లుగా రామాయణం ఉందా? మరో విధంగా ఉందా? అని చర్చిస్తున్నారు అని ఆయన అన్నారు. అయితే సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నట్టు శ్రీరాముడు, రావణాసురుడు, హనుమంతుడు ఇలాగే ఉండాలని విమర్శించడాన్ని తప్పుపట్టిన ఆయన ఆదికవి వాల్మీకి మాదిరిగా రామాయణాన్ని ఎవరూ తీయలేరని ఎవరు అలాంటి ప్రయత్నం చేసినా అందులో ఎంతో కొంత కొదవ ఉండటం సహజం అని అన్నారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించి ఆ ప్రయత్నాన్ని అభినందించాలని, ప్రతీ ఒక్కరు కూడా సినిమా చూడాలని సూచించారు.