Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi: తమిళ స్టార్ హీరో విజయ్‌తో జరిగిన ఓ ప్రత్యేకమైన మీటింగ్ గురించి టాలీవుడ్ హిట్‌మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనల్లో విజయ్ గారిని కలవడం కూడా ఒకటని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ నటించిన ‘ది GOAT’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్న సమయంలో తనకు ఊహించని విధంగా దళపతి విజయ్ నుంచి పిలుపు వచ్చిందన్నారు. అప్పటికే విజయ్ తన డైరెక్షన్లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని చూసినట్లు తెలిసిందని, వెంటనే ఆయనను కలవడానికి షూటింగ్ లొకేషన్‌కు వెళ్లినట్లు వెల్లడించారు.
కారవాన్‌లో సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఆ మీటింగ్‌లో విజయ్ తనను అభినందించిన విధానం ఎప్పటికీ మర్చిపోలేనిదని అనిల్ రావిపూడి తెలిపారు. “నేను భగవంత్ కేసరి సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. మీరు చాలా బాగా తెరకెక్కించారు. సినిమాలోని కొన్ని ఎపిసోడ్లు ఇప్పటికీ నా మనసులో తిరుగుతూనే ఉన్నాయి. అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి అభినందించాలనిపించింది” అని విజయ్ తనతో చెప్పారని అనిల్ వెల్లడించారు. విజయ్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఆ భేటీ ముగిసిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫోన్ చేసి ఈ విషయాన్ని పంచుకున్నానని ఆయన వెల్లడించారు. అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!