తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఓ మూవీలో రజినీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్‌లో 169వ సినిమాగా వస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. నెల్సన్-రజినీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో కత్తికి రక్తపు మరకలు ఉన్నట్లు చూపించారు. జైలులోని ఖైదీలు నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని ప్రతిష్టాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
కాగా ఈ మూవీలో రజినీకాంత్ సరసన అందాల భామ ఐశ్వర్యరాయ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోబో సినిమా తర్వాత మరోసారి వీరి జంట వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనుందని తెలుస్తోంది. నటి ప్రియాంక మోహన్ మరో హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, హీరో శివకార్తికేయన్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. జూలై నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరో విశేషం ఏమిటంటే జూలై నాటికి రజనీకాంత్ నటుడిగా 47ఏళ్ల మైలురాయిని చేరుకోనున్నా రు. దీంతో జైలర్ చిత్రానికి సంబంధించి ప్రత్యేక టీజర్ విడుదలయ్యే అవకాశముంది.
#Thalaivar169 is #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/tEtqJrvE1c
— Sun Pictures (@sunpictures) June 17, 2022