TFJA: ఆ విషయంలో సినీ సెలబ్రెటీలకు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TFJA ID and health Cards Distribution 2023-24: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టిఎఫ్‌జేఏ సభ్యులకి ఈ యేడాది (2023 మార్చి 2024 మార్చి) వరకు సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్న ముఖ్య అతిధిగా హాజరు కాగా ఎర్నేని నవీన్, జాన్వీ నారంగ్, సాహు గారపాటి అలానే టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ లో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి మూడు లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీలను ఉచితంగా అందిస్తున్నారు. ఇక అలా చేయడం కోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. అయితే ఈ క్రమంలో టిఎఫ్‌జేఏ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు మాట్లాడుతూ సినీ సెలబ్రిటీలు మనకు ఎంతో చేస్తున్నారని, మరి మనం వారికి ఏం చేస్తున్నాం అనిపించినప్పుడు రీసెంట్ గా దిల్ రాజు గారు, చిరంజీవి గారితో అసోసియేషన్ తరఫున సినిమా కోసం ఏం చేయాలి అని మాట్లాడటం జరిగిందని అన్నారు. మన జర్నలిస్ట్ లకు వాళ్లు అంత సాయం చేస్తున్నప్పుడు వారికి సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ లుగా మనం చేయాలని అని చర్చించడం జరిగిందని పేర్కొన్న ఆయన సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎక్కువ నాన్సెస్ జరుగుతోంది అని అన్నారు.
Taj Mahal: తాజ్ మహల్ గోడలను తాకిన యమునా నదీ జలాలు.. 45 ఏళ్లలో మొదటిసారి!
Also Read
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
- Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
- Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
వీటిలో ఎక్కువగా ఇబ్బంది పడేది సెలబ్రిటీసే ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లపై ఏది పడితే అది రాస్తున్నారు, అలాంటప్పుడు వాళ్లు ఒంటరిగా ఫైట్ చేయలేరని, సినిమాలు షూటింగ్స్ ఉంటాయని పేర్కొన్న ఆయన అలాంటప్పుడు మా అసోసియేషన్ తరఫున మే అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ఈ మేరకు పోలీస్ డిపార్ట్ మెంట్, లాయర్స్, ఛాంబర్, మా అసోసియేషన్ వారితో మాట్లాడి ఓ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీలో మా సభ్యులు కూడా నలుగురు ఉంటారని అన్నారు. దీని వల్ల ఇకపై ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కు వచ్చే సమస్యలు తీరేవరకూ మేం ఫైట్ చేస్తామని అన్నారు. ఇది చెప్పగానే చిరంజీవి, దిల్ రాజు గారూ అద్భుతమైన ఐడియా అని మెచ్చుకున్నారని వెంటనే ప్రారంభించమని ప్రోత్సహించారు. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా చూసుకుని ఈ కమిట్ స్టార్ట్ చేయబోతున్నామని ఏదో ఒక సమస్య వస్తే మొత్తం మీడియాను బ్లేమ్ చేస్తున్నారని అన్నారు. తప్పులు అందరూ చేయరు, చేసిన ఒకరిద్దరి వల్ల మొత్తం సమస్య రాకూడదని అన్నారు. ఇంతకు ముందు మా అసోసియేషన్ తో పాటు ఇతర అసోసియేషన్స్ లో ఫిర్యాదు చేసేవారు, ఇకపై ఎవరైనా ఏదైనా సమస్య గురించి మన కమిటీకి చెబితే ఆ సమస్య తీరేవరకూ జర్నలిస్ట్ లుగా మనం తీసుకోబోతున్నామని, ఇది భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమం అని అన్నారు.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!