RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ క్రేజీ కాంబినేషన్స్‌లో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబో ఒకటి. వీరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తాజాగా ఈ కాంబినేషన్లో రాబోతున్న తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా చరణ్ కెరీర్లోనే మైండ్‌బ్లోయింగ్ ప్రాజెక్ట్‌గా నిలవనుందని తెలుస్తోంది.
ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి ఇదొక పీరియాడిక్ డ్రామా అని రెండు భాగాలుగా రాబోతోందని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఎలాంటి పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగదు. అలాగే రెండు పార్టులు కూడా ఉండవు. ఒకే ఒక్క పార్టుగా పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మెగా అభిమానులు వింటేజ్ చరణ్ నుండి ఎలాంటి హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆశిస్తారో.. అవన్నీ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయట. సుకుమార్ సినిమాల్లో మైండ్ బెండింగ్ స్క్రీన్‌ప్లే సర్ప్రైజ్లు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కూడా సరికొత్త స్క్రీన్‌ప్లే మ్యాజిక్ ఉండబోతోంది. ఇక రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్ విషయానికొస్తే.. ‘రంగస్థలం’ లోని చిట్టిబాబు పాత్రకు, అలాగే ఆయన నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలోని పవర్ఫుల్ పాత్రలకు మించిన పర్ఫార్మెన్స్ స్కోప్ ఈ మూవీలో చరణ్‌కు లభించనుంది. ఈ చిత్రానికి ఒక బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించబోతున్నట్లు టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. అనంతరం నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించనున్నారు. ఇక సినిమా విడుదలకు సంబంధించి భారీ ప్లానే వేశారు. ఈ క్రేజీ చిత్రాన్ని 2027 ఎండింగ్లో లేదా 2028 మార్చి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నారు.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!