Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chand Mera Dil OTT: బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సినిమాలు, ఓటీటీకి వచ్చిన తర్వాత ట్రెండింగ్ లోకి రావడం ఇప్పుడు కొత్త విషయం కాదు. థియేటర్లలో ఆశించిన వసూళ్లు రాబట్టలేక నిరాశపరిచిన ఎన్నో చిత్రాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరిన మరో బాలీవుడ్ చిత్రం ‘చాంద్ మేరా దిల్’. విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్, ఇప్పుడు ట్రెండింగ్ చార్ట్స్‌లో దూసుకెళ్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. వివేక్ సోని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనన్య పాండే, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంది. విమర్శకుల నుంచి కూడా నెగిటివ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ నిరాశాజనకంగా ముగిసింది.
అయితే డిజిటల్ విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2026 జూలై 17న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ‘చాంద్ మేరా దిల్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానాల్లోకి చేరింది. ప్రస్తుతం ప్లాట్ఫామ్లో టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచి, ‘ధురందర్ 2’, ‘ప్రీతమ్ & పెడ్రో’ వంటి చిత్రాలను కూడా వెనక్కి నెట్టినెట్టి మూడవ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా కథ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ప్రేమలో పడిన వాళ్ళు పెళ్లి చేసుకుని జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, కెరీర్ ఒత్తిళ్లు వారి బంధాన్ని పరీక్షిస్తాయి. ప్రేమ, త్యాగం, బాధ్యతల మధ్య వారి జీవితం ఎలా మారింది? చివరకు వారి ప్రేమ గెలిచిందా లేదా? అనే అంశాలను దర్శకుడు ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశారు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
సుమారు 2 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీలో ప్రేమకథను మాత్రమే కాకుండా, పెళ్లి తర్వాత కొత్త దంపతులు ఎదుర్కొనే సంఘటనలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందకపోయినా, ఇంట్లో ప్రశాంతంగా చూసే ప్రేక్షకులకు ఈ కథ మరింతగా కనెక్ట్ అవుతుండటం విశేషం. అందుకే ఇప్పుడు ‘చాంద్ మేరా దిల్’ ఓటీటీలో మంచి వ్యూయర్షిప్ను నమోదు చేస్తూ, తప్పక చూడాల్సిన రొమాంటిక్ డ్రామాల్లో ఒకటిగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!