Theppa Samudram Teaser Released: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘తెప్ప సముద్రం’. శ్రీ మణి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ మీద బేబీ వైష్ణవి సమర్పిస్తున్న ఈ సినిమాను నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మించగా సతీష్ రాపోలు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకి పి.ఆర్ మ్యూజిక్ అందించారు. ఇక శివరాత్రి సందర్భంగా తెప్ప సముద్రం టీజర్ ని అల్లరి నరేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీజర్ చూస్తే అమ్మాయిల మర్డర్ మిస్టరీ వెనక దాగున్న ఆ రాక్షసుడు ఎవరు అనే కోణంలో ఆద్యంతం ఒక మిస్టరీగా మన ముందుకు తీసుకు వస్తున్నట్టు అర్ధమవుతోంది.
Aishwarya Rajinikanth : లాల్ సలామ్ ఫెయిల్ అవడానికి కారణం అదే..?
2015 లో తెలంగాణాలో హాజీపూర్ లో సంచలనం సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరికొంత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ అయిందాక వెయిట్ చేయాల్సిందే. ఇక టీజర్ రిలీజ్ అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ తెప్ప సముద్రం టీజర్ చూడగానే ఒక మంచి థ్రిల్లర్ ఫీల్ వచ్చిందని, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ సినిమాని పెద్ద హిట్ చేయగలరని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇక దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ సినిమా ఏప్రిల్ 12 న మీ ముందుకు రాబోతుందని తెలిపారు. హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ తెప్ప సముద్రం అనేది మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్, ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు. మంగ్లీ, పెంచల్ దాస్, హేమచంద్ర పాటలు పడిన ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శేఖర్ పోచంపల్లి.