Aishwarya Rajinikanth : లాల్ సలామ్ ఫెయిల్ అవడానికి కారణం అదే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది రిలీజ్ అయిన జైలర్ మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన రజనీకాంత్ ఆ తరువాత తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో లాల్ సలామ్ అనే మూవీలో గెస్ట్ రోల్ లో నటించారు.భారీ అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన లాల్‌సలామ్ డిజాస్టర్ అయ్యింది. రజనీకాంత్ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా లాల్‌సలామ్ నిలిచింది.తెలుగు వెర్షన్ అయితే మరీ దారుణంగా కోటి కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. తొలిరోజే థియేటర్లలో జనాలు లేక చాలా షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ సినిమాలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. కానీ రజనీకాంత్ పేరును ప్రమోషన్స్‌లో ఎక్కువగా వాడుకున్నారు. సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ కేవలం 30 నిమిషాల లోపే ఉండటం, పాత్రకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో లాల్ సలామ్‌ను అభిమానులు తిరస్కరించారు.
లాల్ సలామ్ రిజల్ట్‌పై దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తాజాగా రియాక్ట్ అయ్యింది. తండ్రి రజనీకాంత్ క్యారెక్టర్‌లో చేసిన మార్పుల వల్లే తాము అనుకున్న రిజల్ట్ రాలేదని తెలిపింది.ముందుగా తాను రాసుకున్న కథలో రజనీకాంత్ క్యారెక్టర్ సెకండాఫ్‌లో కేవలం పది నిమిషాలు మాత్రమే కనిపిస్తుందని ఐశ్వర్య తెలిపింది. “రజనీకాంత్ కోసం సెకండాఫ్ వరకు అభిమానులు వేచిచూడటం కష్టమని అనిపించింది. కథలో ఆయన పాత్ర మరి చిన్నగా ఉంటే డిసపాయింట్ అవుతారని భావించాం. రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు రజనీకాంత్ క్యారెక్టర్‌లో చాలా మార్పులు చేశాం. ఫస్ట్‌హాఫ్‌లోనే రజనీ పాత్రను పరిచయమయ్యేలా సినిమాను ఎడిట్ చేశాం. సెకండాఫ్‌లో రజనీకాంత్ క్యారెక్టర్ లెంగ్త్ ను పెంచాం. రజనీకాంత్ పాత్ర కోసం కథకు సంబంధం లేని చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకు జోడించాల్సి వచ్చింది.ఈ కమర్షియల్ హంగుల కారణంగా కథ వీక్ అయిపోయింది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ కూడా నేను అనుకున్నట్లుగా కాకుండా మరోలా మారిపోయింది” అని ఐశ్వర్య రజనీకాంత్ తెలిపింది. ఈ మార్పులన్నీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు చేశామని, అది కూడా సినిమా ఫెయిల్యూర్‌కు ఓ కారణమని ఐశ్వర్య రజనీకాంత్ అన్నారు.
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!