Hero Adith Arun alias Trigun Married Niveditha: తెలుగు సినీ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ ఏడాది మన టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోగా వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో మరో యంగ్ హీరో కూడా చేరాడు. టాలీవుడ్ లో అనేక సినిమాలు చేసి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో త్రిగున్. జెనీలియాతో కలిసి ‘కథ’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి ఆయనకి అంతగా గుర్తింపు రాలేదు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ సినిమాలో కీ రోల్ ప్లే చేసి ఆ తర్వాత ‘డియర్ మేఘ’, ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు.
Jr NTR: ఎన్టీఆర్ ఒక్కడికే ఆ సత్తా.. ఆకాశానికి ఎత్తేసిన గదర్ 2 డైరెక్టర్
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ హీరో ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. పెద్దలు కుదిర్చిన నివేదిత అనే అమ్మాయిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి శ్రీ సెంటర్ మహల్ అవినాశి, తిరుపూర్ తమిళనాడులో జరిగింది. ఈ పెళ్లికి సినీ పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. నిజానికి త్రిగున్ అసలు పేరు అరుణ్ ఆదిత్. ఇదే పేరుతో తెలుగు, తమిళ్లో హీరోగా కొన్ని సినిమాలు చేసి, 2022లో తన పేరును త్రిగున్ గా మార్చుకున్నాడు. జాతకం ప్రకారం ‘త్రిగున్’ అనే అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ హీరో పేరు మార్చుకున్నా పెద్దగా కలిసి రాలేదు.