Gadar 2 Director Anil Sharma Intresting Comments on Jr NTR: బాలీవుడ్ పంట పండిందా అన్నట్టుగా అనిల్ శర్మ డైరెక్ట్ చేసిన “గదర్ 2” బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది. ఇప్పటికే వసూళ్లు దాదాపు 500 కోట్లు దాటి మరింత ముందుకు దూసుకుపోతోంది. ఇక విడుదలైన 20 రోజుల తర్వాత కూడా సన్నీ డియోల్-అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన పీరియడ్ డ్రామా సీక్వెల్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూనే ఉంది. ఇక ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ శర్మ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. “గదర్” సినిమాలో తారా సింగ్(సన్నీ డియోల్) పాత్రను పోషించగల ఇప్పటి తరం నటుడు ఎవరైనా ఉన్నారా , “గదర్”లో తారా సింగ్ పాత్రను ఎవరు పోషించగలరని ఇంటర్వ్యూయర్ అడగగా దర్శకుడు, ఎటువంటి సందేహం లేకుండా, బాలీవుడ్ నుండి తారా సింగ్ పాత్రలో సన్నీ డియోల్‌తో సరిపోలేవారు ఎవరూ లేరని కుండబద్దలు కొట్టేశాడు.
Vishal: నేషనల్ అవార్డులపై విశాల్ అనుచిత వ్యాఖ్యలు.. వస్తే చెత్త బుట్టలో పడేస్తాడట?
అయితే దక్షిణాది నుంచి మాత్రా తారా సింగ్‌గా నటించగల ఏకైక నటుడు ఎన్టీఆర్ అని అన్నారు. దక్షిణాదికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ లాంటి బ్రిలియంట్ యాక్టర్ ఈ క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోతాడని అన్నారు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ అనిల్ శర్మ నుంచి ఎన్టీఆర్ కి ఇది భారీ కాంప్లిమెంట్ అనే చెప్పాలి. ఇక ఈ మాటతో ఎన్టీఆర్ అభిమానులు అందరూ కాలర్ ఎగరేస్తున్నారు. నిన్నమొన్నటి దాకా జాతీయ అవార్డు రాలేదని బాధ పడిన వారంతా ఇప్పుడు ఒక సెన్సేషనల్ డైరెక్టర్ మా హీరో తప్ప మరో ఆప్షన్ లేదని అన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజమే మరి ఎన్టీఆర్ లాంటి పవర్ హౌస్ యాక్టర్ ఆ రోల్ కి కరెక్ట్ గానే సూట్ అవుతాడు.