Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ‘తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్’లో రగులుతున్న వివాదాలపై ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతకు ఊహించని భారీ షాక్ ఇస్తూ, ఆమె నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని ఫెడరేషన్ తక్షణమే రద్దు చేసింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరును పరిష్కరించే దిశగా ఫిల్మ్ ఫెడరేషన్ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఫెడరేషన్ పెద్దల ఆధ్వర్యంలో అధ్యక్షురాలు సుమలత, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మరియు యూనియన్ సభ్యులతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు అసోసియేషన్ కు చెందిన మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు.
ఈ సమావేశంలో డ్యాన్సర్ల మద్దతు ఎవరికి ఉందనే విషయంపై జరిగిన బలనిరూపణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా అధికారంలో ఉన్న సుమలతకు కేవలం 11 మంది డ్యాన్సర్లు మాత్రమే మద్దతు తెలపడం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మరోవైపు, రఘు మాస్టర్‌కు ఏకంగా 214 మంది డ్యాన్సర్లు పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. ఈ భారీ మెజారిటీని బట్టి చూస్తే, డ్యాన్సర్లంతా రఘు మాస్టర్ నాయకత్వాన్నే బలంగా కోరుకుంటున్నారని స్పష్టమైంది. సభ్యుల మద్దతు లేకపోవడం, మెజారిటీ డ్యాన్సర్లు రఘు మాస్టర్ పక్షాన నిలబడటంతో.. ఫిల్మ్ ఫెడరేషన్ వెంటనే స్పందించి సుమలత ప్యానెల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయంతో పాటు, అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ వెల్లడించింది. సభ్యుల మద్దతు ఏకపక్షంగా రఘు మాస్టర్ వైపు ఉండటంతో, రాబోయే ఎన్నికల్లో ఆయన ప్యానెల్ గెలవడం దాదాపు ఖాయమనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..