దేవర బ్లాక్ బస్టర్ తర్వాత జోష్ లో ఉన్న ఎన్టీఆర్ అదే ఎనర్జీతో ‘వార్ 2’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ వైపు వార్ 2 జరుగుతుండగానే ప్రశాంత్ నీల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మధ్య గ్రాండ్ పూజా కార్యక్రమాలు నిర్వహిచుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసారు. రాస్తారోకో, అల్లర్లు వంటి సన్నివేశాలు చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేని సీన్స్ తీసాడు ప్రశాంత్ నీల్.
Also Read : Bollywood : అక్షయ్ కుమార్ వర్సెస్ సంజయ్ దత్
ఇప్పటి వరకు టైగర్ లేని సీన్స్ ను షూట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు టైగర్ ఆగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు. మ్యాన్ ఆఫ్ మసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏప్రిల్ 22న ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడని ప్రకటించారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్‌నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తొలిసారి ప్రశాంత్, ఎన్టీఆర్ సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ మరో ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.