టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా చిత్రాలో ‘మిరాయ్’ ఇకటి. తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిస్తున్న, ఈ పౌరాణిక యాక్షన్-థ్రిల్లర్‌లో మంచు మనోజ్ విలన్‌గా, శ్రియ కీలక పాత్రలో నటిస్తూన్నారు. ఇప్పటికే విడుదలైప ప్రతి ఒక్క అప్‌డేట్ లో యాక్షన్ సన్నివేశాలను మరొక స్థాయికి తీసుకెళ్లగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ మంచి ప్రామిసింగ్‌గా ఉందని చెప్పాలి. ముఖ్యమైన ఓ 9 శక్తివంతమైన గ్రంథాలు.. వాటి కోసం వెతికే విలన్, వాటిని అతనికి చిక్కకుండా చేసేందుకు పోరాటం చేసే హీరో ఈ మధ్యలో సాలిడ్ యాక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఊహించని లెవెల్లో ఉన్నాయి. మొత్తనికి సెపరేట్ ప్రపంచాన్ని చూపిస్తూ మేకర్స్ ఇంప్రెస్ చేశారు.
Also Read : Mirai: నా కెరీర్‌కి ఈ రోల్.. దేవుడు ఇచ్చిన వరం : మనోజ్
కాగా ఈ కార్యక్రమంలో తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘నేను పాన్ ఇండియా హీరో కావాలనుకోవడం లేదు. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే నటిస్తున్నాను. మీ అందరి మెప్పు కోసం వర్క్ చేస్తున్నాను. నా సినిమా మిగతా వారికి నచ్చితే అది బోనస్ మాత్రమే. నేను ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటాను, మీ కోసం ప్రెస్ మీట్స్ నిర్వహిస్తాను. ఈ సినిమాలో మంచు మనోజ్ కనిపించిన ప్రతిసారీ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వస్తాయి’ అని తెలిపారు. అలా తేజ తన అభిమానుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానాన్ని, వారి కోసం చేస్తున్న కృషిని స్పష్టంగా వ్యక్తం చేశారు. ఆయన చెప్పినట్లు, ఈ సినిమా పూర్తిగా తెలుగు ప్రేక్షకుల కోసం కట్టుబడి రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్‌లోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వనుందని అర్ధం అవుతుంది.