యువ నటుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిరాయ్’ (Mirai). కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించనుండగా, సీనియర్ నటి శ్రియ కీలక పాత్ర పోషిస్తూన్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌న్ను విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలు మరొక స్థాయికి తీసుకెళ్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయ్యారు..
Also Read : Madhavan : లేహ్‌లో చిక్కుకుపోయిన మాధవన్..
“మూడేళ్ల క్రితం ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఈ అవకాశం దేవుడు ఇచ్చిన వరం గా భావిస్తున్నాను. ఎందుకంటే నా కెరీర్‌లో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. ‘హనుమాన్’ వంటి హిట్ తర్వాత డబ్బు సంపాదించే సినిమాలకే వెళ్ళడం సులభం, కానీ తేజ ‘మిరాయ్’ కోసం మూడేళ్లు వేచి ఉన్నాడు. కార్తీక్ దండు ని కలిసిన తర్వాత, కథను ఎలా చూపించాలో అర్థమైంది. ఆరేళ్ల క్రితం రాసిన కథ ఇప్పుడు సినిమాగా మారింది. అశోకుడు రాసిన 9 పుస్తకాల కధలను ప్రపంచానికి తెలియజేయడానికి ఈ చిత్రాన్ని రూపొందించారు.నిర్మాత విశ్వప్రసాద్ ‘రాజాసాబ్’ కోసం ఎంత చేస్తున్నారో మా ‘మిరాయ్’ కి కూడా అంతే చేస్తున్నారు. ఇది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సంబంధం లేదు. శ్రియ తో నటించాలని ఎప్పటినుంచో అనుకున్నాను, ఇప్పుడు అది తీరింది. నా అభిమానులకు రుణపడి ఉంటాను’ అని తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.